Share News

Narendra Modi: రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో తర్వాత అర్థమైంది

ABN , Publish Date - May 08 , 2024 | 02:01 PM

వరంగల్ నగరానికి బీజేపీతో మంచి అనుబంధం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారన్నారు. అందులో ఒక ఎంపీ జంగారెడ్డి.. హన్మకొండ నుంచి గెలుపొందారని మోదీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అహ్మదాబాద్ తన కర్మభూమి అని.. ఆ నగర దేవత భద్రకాళి అని చెప్పారు.

Narendra Modi: రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో తర్వాత అర్థమైంది

వరంగల్, మే 18: వరంగల్ నగరానికి బీజేపీతో మంచి అనుబంధం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారన్నారు. అందులో ఒక ఎంపీ జంగారెడ్డి.. హన్మకొండ నుంచి గెలుపొందారని మోదీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అహ్మదాబాద్ తన కర్మభూమి అని.. ఆ నగర దేవత భద్రకాళి అని చెప్పారు. అలాగే వరంగల్‌లో కూడా నగర దేవత భద్రకాళి అని మోదీ గుర్తు చేశారు. ఈ క్షేత్రం కాకతీయ సామ్రాజ్య వైభవానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. భద్రకాళి చరణాలకు ఈ సందర్బంగా మోదీ నమస్కారాలు తెలిపారు.

Kutami: తాను ఎప్పటికీ అలానే ఉంటాను: వెలగపూడి రామకృష్ణ బాబు

బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అదికారంలోకి వస్తే.. ఆ రాష్ట్రం.. ఆ పార్టీకి ఏటీఎంగా మారుతుందని పేర్కొన్నారు. అందుకు జార్ఖండ్‌లో దొరికిన నగదే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని విమర్శించారు. ఆ నగదు ఎక్కుడకు వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. ఇక తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ ద్వారా ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఆ డబుల్ ఆర్ ట్యాక్స్‌లో ఒక ఆర్ హైదరాబాద్‌కు వెళ్లితే.. మరో ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి వెళ్తుందని ఆరోపించారు.


ప్రపంచంలో చాలా దేశాల్లో అశాంతి, అస్థిరత్వం ఉందని మోదీ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఇతరుల చేతిలోకి వెళ్ల కూడదని ఆయన స్పష్టం చేశారు. అందుకే దేశం అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటుందన్నారు. గతంలో దేశంలో వరుస బాంబు పేలుళ్ల జరిగేవన్నారు. కానీ ఇప్పటి వరకు మూడు దశల్లో పోలింగ్ జరిగిందని.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు.

AP Elections: జూన్ 4న సీఎం పదవికి జగన్ రాజీనామా చేయడం ఖాయం: గంటా

కాంగ్రెస్ పార్టీ పాలనలో వేల కోట్ల కుంభకోణాలు జరిగాయన్నారు. ఆ పార్టీ ఎక్కడ ఉంటుందో.. అక్కడ కుంభోకణం ఉంటుందన్నారు. ఆ పార్టీ పదేళ్ల క్రితం చేసిన పాపాలను ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని బీఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. కానీ కర్ణాటకలో బీసీ రిజర్వేషన్లు కత్తిరించి.. వాటిని ముస్లింలకు ఇచ్చిందని ఈ సందర్బంగా మోదీ గుర్తు చేశారు.


ఇదే తరహా రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని గమనిస్తే.. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ముందు రాదు కానీ.. ముస్లింలకు ఆ రిజర్వేషన్లు కట్టబెట్టేందుకు ముందుకు వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయంతో.. ఓబీసీలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

CM Ramesh: సీఎం రమేష్‌పై మంత్రి ముత్యాలనాయుడు సంచలన కామెంట్స్..

మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డు పడుతుందన్నారు. అయితే మాదిగలకు తాను ఇచ్చిన హామీ మరిచిపోలేదన్నారు. ఇక బీఆర్ఎస్ సైతం బుజ్జగింపు రాజకీయాలే చేస్తుందన్నారు. 2014లో దళిత వ్యక్తి సీఎంగా చెస్తానని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారని చెప్పారు. కానీ ఆయన ఆ పని చేయలేదన్నారు.


నాలుగో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ సీట్ల కోసం.. భూతద్దంలో కాదు.. మైక్రోస్కోప్‌లో వెతుకోవాల్సి ఉంటుందన్నారు. సమ్మక, సారక్క గిరిజన యూనివర్విటీకి కేంద్రం ఆమోదిస్తే.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అటంకాలు పెడుతుందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందన్నారు. 2014లో తాము అధికారంలోకి రాగానే దళిత వ్యక్తి రామనాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేశామని.. అలాగే 2019లో అదివాసీలకు చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశామని తెలిపారు.

Komatireddy Venkatreddy: వచ్చే పదేళ్లు రేవంతే సీఎం.. జూన్ 5కి వారంతా కాంగ్రెస్‌లోకి..

కానీ ఈ రెండు నియామకాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని మోదీ గుర్తు చేశారు. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేయాడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డు పడిందో చాలా కాలం తనకు అర్థం కాలేదన్నారు. కానీ ఆ తర్వాత అసలు విషయం అర్తమైందని చెప్పారు. ద్రౌపది ముర్ము గారి చర్మం రంగు నలుపు.. ఇక్కడ ఉన్న రాజకుమారిడికి అమెరికాలో ఓ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ ఉన్నారని వివరించారు. ఆయన ఇటీవల ఓ మాట చెప్పారు.. చర్మం నల్లగా ఉన్నవారంతా ఆఫ్రికన్లు అని చెప్పారన్నారు.


అంటే చర్మం రంగును బట్టి ద్రౌపది ముర్ముగారిని ఆఫ్రికన్ అని కాంగ్రెస్ వాళ్లు భావించి ఉంటారన్నారు. అందుకే ఆమెను ఓడించాలని కాంగ్రెస్ పార్టీ భావించి ఉంటుందని విపులీకరించారు. దేశంలో చాలా మందికి నలుపు చర్మం ఉంటుదన్నారు. ఈ నలుపు ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. భగవాన్ శ్రీకృష్ణుడు రంగు నీలం, నలుపు అని మోదీ గుర్తు చేశారు.

Lok Sabha Elections: జైలు నుంచే కేజ్రీవాల్ ఎన్నికల వ్యూహాలు..

సోనియా జన్మదినం రోజు.. రుణ మాఫీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. చివరకు ఆగస్ట్ 15వ తేదీకి రుణమాఫీని మార్చరన్నారు. సనాతన ధర్మాన్ని తిట్టే వారిని నమ్మగలమా అని మోదీ ఈ సందర్భంగా ప్రశ్నించారు. గతంలో పలు నగరాల్లో వరుస బాంబు పేలుళ్లు జరిగేవన్నారు. తెలంగాణ వీరులు, మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా? అని ప్రశ్నించారు. హామీలు ఇచ్చి.. మరిచిన కాంగ్రెస్.. తెలంగాణకు మేలు చేస్తుందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. మహిళలకు 2,500 ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ ఏమైందని ఈ సందర్బంగా మోదీ ప్రశ్నించారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 02:08 PM