Share News

CM Ramesh: సీఎం రమేష్‌పై మంత్రి ముత్యాలనాయుడు సంచలన కామెంట్స్..

ABN , Publish Date - May 08 , 2024 | 12:33 PM

బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై మంత్రి బూడి ముత్యాల నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. నేడు ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్నికల సంఘం నుంచి ఒత్తిళ్లు తెచ్చి తనపై అక్రమంగా కేసులు బనాయించాలని చూస్తున్నారన్నారు. నేర చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి సీఎం రమేష్ అని ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి పోలీస్ యంత్రాంగం కూడా సీఎం రమేష్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.

CM Ramesh: సీఎం రమేష్‌పై మంత్రి ముత్యాలనాయుడు సంచలన కామెంట్స్..

అనకాపల్లి: బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై మంత్రి బూడి ముత్యాల నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. నేడు ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్నికల సంఘం నుంచి ఒత్తిళ్లు తెచ్చి తనపై అక్రమంగా కేసులు బనాయించాలని చూస్తున్నారన్నారు. నేర చరిత్ర, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి సీఎం రమేష్ అని ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించి పోలీస్ యంత్రాంగం కూడా సీఎం రమేష్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. న్యాయం జరగకపోతే కోర్టులో తేల్చుకుంటానన్నారు. నిబంధనలు అతిక్రమించి, డ్రోన్ కెమెరాను మా ఇంటి పైకి పంపి రెక్కి నిర్వహించారని ముత్యాల నాయుడు ఆరోపించారు. సీఎం రమేష్‌ను పోలీసులు రావద్దని చెప్పినా తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమందితో కలిసొచ్చి దౌర్జన్యం చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) అడ్డుకుంటున్నారని ముత్యాల నాయుడు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి...

CM Revanth: రేవంత్ చేతులకు గోర్లతో రక్కిన గాయాలు.. అసలేమైంది..?

Lok Sabha Polls: యూపీలో పార్టీలకు వణుకు పుట్టిస్తున్న ఓటర్లు.. పోలింగ్ శాతంపై టెన్షన్..

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2024 | 12:33 PM