Share News

Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు తేడా లేదు.. ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయి

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:58 PM

భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్‌లో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మూడోసారి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.

Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు తేడా లేదు.. ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయి
Bandi Sanjay

సిద్దిపేట: భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్‌లో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మూడోసారి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు.

Delhi liquor Scam: కవిత బెయిల్‌ పిటిషన్స్.. సీబీఐ కేసులో అలా.. ఈడీ కేసులో ఇలా..


‘నరేంద్ర మోదీ మరొసారి ప్రధాని కావాలని రాష్ట్రంలోని తాజా మాజీ సర్పంచులు కోరుకుంటున్నారు. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అందుకు కారణం నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి మళ్లించింది. గ్రామాలు అభివృద్ధి చెందాలనే మోదీని మరోసారి గెలిపించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పులు చేయగా, కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరు చెప్పి మోసం చేసింది. దేశాన్ని 57 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.1100 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం రూ.59,000 కోట్లు ఖర్చు చేసింది. కేంద్ర మంత్రివర్గంలో 8 మంది ఎస్టీ, 12 మంది ఎస్సీ, 20 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్టీ మంత్రులు ఎవరైనా ఉన్నారా..? గిరిజన బిడ్డ రాష్ట్రపతి అయ్యేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేశాయి అని’ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు లోపాయికారీ ఒప్పందం చేసుకొని తనను కరీంనగర్‌ పార్లమెంట్ స్థానంలో ఓడించాలని ప్రయత్నిస్తున్నాయి. హుస్నాబాద్‌లో ఎంత మందికి 6 గ్యారంటీలు అమలు చేశారు..? శ్వేత పత్రం విడుదల చేయండి. గౌడ కులస్తుల తాటి చెట్లు కాలిపోతే ఎంత మంది గౌడ సోదరులకు సాయం చేశారో స్పష్టం చేయాలి. పొడు భూముల కోసం కొట్లాడింది మేము. అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడితే కోట్లాడింది మేము. కేసీఆర్, కేటీఆర్ బజారులో పడ్డారంటే అందుకు కారణం బండి సంజయ్. నా మీద 109 కేసులు ఉన్నాయి. మా నాయకుడు, ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీకి కెప్టెన్ లేడు, ప్రధాని అభ్యర్థి లేడు. భారత రాష్ట్ర సమితికి రాష్ట్రంలోనే అభ్యర్థులు లేరు. కేసీఆర్ నన్ను ఓడగొట్టేందుకు 5 రోజులు కరీంనగర్‌లో ఉంటాడని తెలిసింది. కరీంనగర్ అభివృద్ధికి ఎం చేశాడో కేసీఆర్‌ను నిలదీయాలి. అవినీతికి ఆస్కారం లేని వ్యక్తిని నేను అని’ బండి సంజయ్ స్పష్టం చేశారు.

CM Revanth Reddy: కరీంనగర్‌ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు రేవంత్ దూరం..

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 22 , 2024 | 03:58 PM