Share News

Delhi liquor Scam: కవిత బెయిల్‌ పిటిషన్స్.. సీబీఐ కేసులో అలా.. ఈడీ కేసులో ఇలా..

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:15 PM

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ అరెస్ట్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌‌పై వాదనలు ముగియగా.. తీర్పున రిజర్వ్ చేసింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. ఆ వెంటనే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు మొదలవగా.. విచారణను కోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. కవిత తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.

Delhi liquor Scam: కవిత బెయిల్‌ పిటిషన్స్.. సీబీఐ కేసులో అలా.. ఈడీ కేసులో ఇలా..
MLC Kavitha bail petition adjourned

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు (Delhi Liquor Scam Case) సంబంధించి సీబీఐ (CBI) అరెస్ట్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌‌పై వాదనలు ముగియగా.. తీర్పును రిజర్వ్ చేసింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు (Delhi Rouse Avenue Court). ఆ వెంటనే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు మొదలవగా.. విచారణను కోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. కవిత తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. విచారణకు సహకరిస్తున్న కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై 10 స్టేట్మెంట్స్ ఇచ్చారని.. ఈడీ ఆయనను అరెస్ట్ చేసిందని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు వెల్లడించారు.

Delhi liquor Case: కవిత బెయిల్‌కు అర్హురాలన్న లాయర్లు.. బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ


అనుమనితురాలిగా కూడా లేని కవితను నిందితురాలిగా మార్చారన్నారు. 5, 6 గంటలు విచారణకు హాజరైన ఒక టెర్రరిస్టు, కరుడుగట్టిన నేరస్థులను ట్రీట్ చేసినట్లు చేశారని వాదించారు. మార్చి 15న ఇల్లీగల్‌గా అరెస్ట్ చేశారన్నారు. కవిత - కేజ్రీవాల్‌లను కలిపి విచారించడంలో ఈడీ విఫలం అయిందని తెలిపారు. విజయ్ నాయర్ సోషల్ మీడియా హ్యాండ్లర్ అని.. ఆయనతో సోషల్ మీడియా అంశంపైనే భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు. బుచ్చిబాబు నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారన్నారు.

CM Revanth: మోదీ - కేసీఆర్ తోడు దొంగలు.. సీఎం రేవంత్‌రెడ్డి విసుర్లు


ఈడీ అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చాక ఆయనకు బెయిల్ వచ్చిందని వెల్లడించారు. రాఘవ రెడ్డి బీజేపీ నుంచి పొత్తులో ఉన్న పార్టీ నుంచి పోటీలో ఉన్నారన్నారు. శరత్ రెడ్డి బీజేపీ ఎలాక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తి అని కోర్టుకు చెప్పారు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కవితను అరెస్ట్ చేశారని అభిషేక్ మను సింఘ్వి వాదించారు. అనంతరం బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

Viral Video: వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తారా? ఓ వ్యక్తి ప్రమాదకర స్టంట్‌పై నెటిజన్లు ఆగ్రహం..

ఉద్యోగాల కోసం 54.25 లక్షల మంది నిరీక్షణ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 22 , 2024 | 03:18 PM