Share News

Viral Video: వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తారా? ఓ వ్యక్తి ప్రమాదకర స్టంట్‌పై నెటిజన్లు ఆగ్రహం..

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:04 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి రోజూ కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నడి రోడ్లపై ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తున్నారు.

Viral Video: వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తారా? ఓ వ్యక్తి ప్రమాదకర స్టంట్‌పై నెటిజన్లు ఆగ్రహం..
Viral Stunt

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి రోజూ కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో వ్యూస్ (views) కోసం కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నడి రోడ్లపై ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తున్నారు (Dangerous Stunts). తాజాగా కొందరు యువకులు చేసిన స్టంట్ అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు (Viral Video).


sumit_cool అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కొందరు యువకులు కారులో (Car) వెళ్తున్నారు. లోపల ఇద్దరు యువకులు కూర్చున్నారు. బయట ఓ ప్లాస్టిక్ కవర్ చుట్టుకున్న యువకుడు వేలాడుతున్నాడు. నవ్వుతూ, ఉత్సాహంగా, అత్యంత ప్రమాదకరంగా వారు ప్రయాణం చేస్తున్నారు. వారి స్నేహితుడు ఆ ప్రమాదకర ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంలో మాత్రం వివరాలు లేవు. వారం క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు దాదాపు 9 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 20 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``ఇదెక్కడి పిచ్చి రా బాబూ``, ``వీళ్ల డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి``, ``వీళ్లను సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Israel- Gaza Conflict: గాజాలో అద్భుతం.. యుద్దంలో మరణించిన తల్లి.. కడుపులో బిడ్డ సేఫ్!


Viral: వేసవికి తెలివితో చెక్.. వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఎలాంటి ట్రిక్కులను ఉపయోగిస్తున్నారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 22 , 2024 | 03:04 PM