Share News

Kolikapudi Srinivas: అభిమాని అంటూ ఎన్టీఆర్‌నే మోసం చేసిన ఘనుడు కొడాలి నాని:..

ABN , Publish Date - Feb 21 , 2024 | 11:39 AM

Andhrapradesh: మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని... ప్రజాసమస్యలపై ఏనాడు కొడాలి నాని మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kolikapudi Srinivas: అభిమాని అంటూ ఎన్టీఆర్‌నే మోసం చేసిన ఘనుడు కొడాలి నాని:..

విజయవాడ, ఫిబ్రవరి 21: మాజీ మంత్రి కొడాలి నానిపై (Former Minister kodali Nani) టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ (TDP Leader Kolikapudi Srinivas) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని... ప్రజాసమస్యలపై ఏనాడు కొడాలి నాని మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత (TDP)బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని అంటే మోసమని.. నాని అంటే నమ్మించి నిండా ముంచడం అని వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్‌ (Junior NTR) మద్దతుతో హరికృష్ణ బిక్షతో రాజకీయంగా ఎదిగారన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ కూడా కొడాలి నాని బాధితుడే అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని దగ్గర కొడాలి నాని కోటి రూపాయలు తీసుకున్నారని.. అది నిజమా? కాదా? నాని చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.

హైదరాబాద్ శివారులోలో తప్పుడు పత్రాలు సృష్టించి 12 ఎకరాల ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి వేరే వ్యక్తుల ద్వారా సాక్షాత్తు ఎన్టీఆర్‌కు ఎకరం రూ. 85 లక్షలు చొప్పున అమ్మి మోసం చేశారని విమర్శించారు. ఆ తరువాత వచ్చిన తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జరిగిన మోసాన్ని గ్రహించి ఆ భూమిని స్వాధీనం చేసుకుందని తెలిపారు. గుడివాడలో నాని వల్ల మోసపోయిన కాపునేత ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నాని ఉనికికి ప్రమాదం ఏర్పడినపుడు చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), లోకేష్‌ను (Nara Lokesh) విమర్శిస్తారని మండిపడ్డారు. ఎవరో ఒకరిని తిట్టడానికే కొడాలి నాని ప్రెస్ మీట్స్ పెడతారన్నారు. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ విమర్శలు జగన్‌ను సంతృప్తిపరచడానికి మాట్లాడతారన్నారు. ‘‘మేము చెప్పిన అంశంపై గుడివాడలో చర్చ పెట్టు మేము వస్తాం. నాని లాంటి కుక్కతో మనకెందుకు అని వదిలేస్తున్నారు తప్ప.. మరేమీ కారణం కాదు’’ అంటూ కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 21 , 2024 | 11:39 AM