Share News

TDP Alliance: చివరకు విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చారు...కూటమి ఫైర్

ABN , Publish Date - Mar 23 , 2024 | 12:00 PM

Andhrapradesh: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడటాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తీవ్రంగా ఖండించింది. విశాఖకు డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చారంటూ మండిపడ్డారు. శనివారం మూడు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వహక రాజధానిగా చేస్తామంటే అందరూ మోసపోయారని... చివరకు విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మర్చారంటూ ఏపీ తెలుగు దేశం పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

TDP Alliance: చివరకు విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చారు...కూటమి ఫైర్

అమరావతి, మార్చి 23: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడటాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి (TDP-Janasena-BJP) తీవ్రంగా ఖండించింది. విశాఖకు డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చారంటూ మండిపడ్డారు. శనివారం మూడు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వహక రాజధానిగా చేస్తామంటే అందరూ మోసపోయారని... చివరకు విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మర్చారంటూ ఏపీ తెలుగు దేశం పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) వ్యాఖ్యలు చేశారు.

పొత్తు చెడగొట్టేందుకు యత్నం: జనసేన

మూడు పార్టీల మధ్య సమన్వయం అవసరమని.. మనం చేసే యుద్ధంలో గెలిచి తీరాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Janasena Leaders Nadendla Manohar) స్పష్టం చేశారు. అధికార పార్టీ మన మధ్య పొత్తు చెడగొట్టేందుకు ప్రయత్నించిందని మండిపడ్డారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి దృష్ట్యా ఈ పొత్తు అవసరమని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఏదోక అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఇచ్చిన స్పూర్తి, పవన్ ఇచ్చిన ధైర్యాన్ని ఆలంబనగా తీసుకుని పనిచేయాలని నాదెండ్ల సూచించారు.

Arvind Kejriwal Arrest: ఐదు నెలలు.. 10 సమన్లు.. కేజ్రీవాల్ అరెస్ట్‌కు ముందు ఏం జరిగిందంటే?


జనసేనను చూసి నేర్చుకున్నాం: బీజేపీ

పోలీస్ ఎఫ్ఐఆర్‌లు ఏ రోజుకు ఆ రోజు ఆన్‌లైన్‌లో పెట్టేలా ఒత్తిడి తేవాలని బీజేపీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు పాకా సత్యనారాయణ (BJP Disciplinary Committee Chief Paka Satyanarayana) అన్నారు. జాతీయ, రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని వెల్లడించారు. రాజధాని, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై బీజేపీ నుంచి క్లారిటీ కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. ఎన్డీఏ కూటమికి ఓటేస్తే.. సంక్షేమంలో కోతలు వేస్తాయనే ప్రచారం వైసీపీ చేస్తోందని.. దాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. ఈ ప్రభుత్వం కులగణన చేపట్టినా.. వివరాలు బయట పెట్టడం లేదన్నారు. కులగణన వివరాలను గోప్యంగా ఉంచి.. అధికార పార్టీ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మండల, గ్రామ స్థాయిల్లోనే సమన్వయం ఉండాలన్నారు. రానున్న రోజుల్లో వార్ రూంలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మన మధ్య ఎన్ని విబేధాలున్నా ఇవాల్టితో సమసిపోవాలన్నారు. ఎక్కడ తగ్గాలనే అంశంపై జనసేనను చూసి తాము నేర్చుకున్నామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని స్పష్టం చేశారు. వైసీపీకి ఓటేస్తే ఓటు మురిగినట్టే అని బీజేపీ నేత పాకా సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి..

Wife and Husband: రోజూ మందు, మాంసం ఇస్తానంటేనే వస్తా.. భర్తకు భార్య వింత షరతు..!

Arvinad Kejriwal: బిగ్‌బాస్‌కు స్వాగతం.. కేజ్రీవాల్‌కు సుఖేశ్ దిమ్మతిరిగే లేఖ..


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 12:32 PM