Share News

Nara Bhuvaneshwari: వైసీపీ వేధింపులకు అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్.. నారా భువనేశ్వరి..

ABN , Publish Date - Apr 06 , 2024 | 01:07 PM

వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. అక్రమ దారిలో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.

Nara Bhuvaneshwari: వైసీపీ వేధింపులకు అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్.. నారా భువనేశ్వరి..

వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. అక్రమ దారిలో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. అక్రమార్జన సొమ్మును విదేశాల్లో దాచుకుంటున్నారని విమర్శించారు. నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్న ఆమె వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న మిస్బ కుటుంబాన్ని పరామర్శించారు. నంద్యాల అంటే తనకు జ్ఞానాపురం నుంచి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన విధానమే గుర్తుకొస్తుందన్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని కానీ అక్రమంగా ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వేధింపులతో షేక్ అబ్ధుల్ సలాం కుటుంబం సూసైడ్ చేసుకున్న ఘటనను తాను మరిచిపోలేదని తెలిపారు.

Trending: ధోనీ విజయం వెనక ఆమె.. ఎవరు, ఏం చేస్తున్నారో మీకు తెలుసా..


నూనెపల్లి గ్రామంలోని 21వ వార్డులో రైల్వే ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు టీడీపీ పాలనలో 80టీఎంసీ నీళ్లను రాయలసీమకు వదిలితే వైసీపీ అధికారంలోకి వచ్చాక నీటి కొరత ఏర్పడిందన్నారు. 80శాతం వక్ఫ్ బోర్డు భూములను వైసీపీ నేతలు ఆక్రమించేశారని ఆరోపించారు. దాదాపు 30 వేల ఎకరాలను భూ కబ్జాలు చేశారని వెల్లడించారు. టీడీపీ హయాంలో షరీఫ్ ను శాసనమండలి ఛైర్మన్ గా నియమించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.


YS Sharmila: బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు.. షర్మిల

వైసీపీ ప్రభుత్వం ప్రతి పథకాన్ని రద్దు చేసి పేదలకు అన్యాయం చేసిందని భువనేశ్వరి ఫైర్ అయ్యారు. చంద్రబాబు మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తయ్యేదన్నారు. కాగా.. భువనేశ్వరిని కలిసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు. నారా చంద్రబాబు అరెస్ట్‌తో పలువురు ఆ పార్టీ అభిమానులు గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంతో బాధితులను పరామర్శించటానికి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పరామర్శ యాత్ర నిర్వహిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 06 , 2024 | 01:07 PM