Share News

Tirupati: తిరుపతి సీటుపై ఉత్కంఠ.. లోకల్ నాన్ లోకల్ వార్ తో గరంగరం..

ABN , Publish Date - Mar 14 , 2024 | 02:49 PM

తిరుపతి : తిరుపతి అసెంబ్లీ సీటుపై లోకల్, నాన్ లోకల్ వార్ నెలకొంది. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్‌లో జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన కీలక నేతలు అత్యవసర భేటీ అయ్యారు.

Tirupati: తిరుపతి సీటుపై ఉత్కంఠ.. లోకల్ నాన్ లోకల్ వార్ తో గరంగరం..

తిరుపతి : తిరుపతి అసెంబ్లీ సీటుపై లోకల్, నాన్ లోకల్ వార్ నెలకొంది. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్‌లో జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన కీలక నేతలు అత్యవసర భేటీ అయ్యారు. తిరుపతి ( Tirupati ) లో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కాకుండా టీడీపీ, బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా స్థానికులకు మాత్రమే సీటు ఇవ్వాలని చర్చించారు. చిత్తూరుకు చెందిన నాన్ లోకల్ వైస్సార్సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు సీటు ఇవ్వటానికి వ్యతిరేకంగా బోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తమ పరిస్థితని పార్టీ పెద్దలు అర్థం చేసుకోవాలని కోరారు. వైసీపీ అభ్యర్థిని ఓడించాలంటే స్థానికులకు అవకావం ఇస్తేనే సాధ్యమని లోకల్ లీడర్స్ స్పష్టం చేశారు.

కాగా.. టీడీపీ-బీజేపీలతో పొత్తు కూటమిలో ఉన్న జనసేనకు తిరుపతి సీటు కేటాయించారు. టీడీపీ పరంగా తిరుపతి అసెంబ్లీ సీటు తొలినుంచీ కీలకమే. ఆరు నెలల కిందటే జనసేనతో పొత్తు ఉంటందన్న సమాచారంతో తిరుపతి సీటును జనసేనకే కేటాయిస్తారనే అంచనాలు మొదలయ్యాయి. ఓ దశలో తిరుపతిలో అధికార పార్టీ అభ్యర్థిని ఢీకొనగలిగే వనరులు జనసేన నాయకులకు లేవన్న అభిప్రాయం కలగడంతో సీటు టీడీపీకే దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఈలోపు సీట్ల సర్దుబాటు జరగడంతో తిరుపతి సీటు జనసేనకు కేటాయించారు.


ఈ పరిణామాల నడుమ చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరారు. సీటు ఏ పార్టీకన్న ప్రచారాలు ఓవైపు సాగుతుండగానే మరోవైపు పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆరణి శ్రీనివాసులును అభ్యర్థిగా పవన్‌ కళ్యాణ్‌ ఖరారు చేశారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 02:49 PM