Share News

AP News: టీడీపీ నేత కంచేటి సాయి అక్రమ అరెస్ట్.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 24 , 2024 | 04:41 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీ(YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా ఉన్నా తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ అరెస్ట్‌లు చేయిస్తూ కుట్ర పన్నుతోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే వైసీపీ అనినీతిని ప్రశ్నిస్తున్న టీడీపీ నేత కంచేటి సాయి(Kancheti Sai)ను ఏపీ పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయించింది. ముంబాయి ఎయిర్ పోర్ట్‌లో కంచేటి సాయిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

AP News: టీడీపీ నేత కంచేటి సాయి అక్రమ అరెస్ట్.. కారణమిదే..?

పల్నాడు జిల్లా: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీ(YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా ఉన్నా తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ అరెస్ట్‌లు చేయిస్తూ కుట్ర పన్నుతోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే వైసీపీ అనినీతిని ప్రశ్నిస్తున్న టీడీపీ నేత కంచేటి సాయి(Kancheti Sai)ను ఏపీ పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయించింది. ముంబాయి ఎయిర్ పోర్ట్‌లో కంచేటి సాయిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

AP Politics: ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతిస్తాం... మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు

ఆయనపై ఇటీవల 307 సెక్షన్లు కింద అమరావతి పోలీసులు కేసు నమోదు చేశారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రోద్బలంతో సాయిపై అక్రమ కేసు బనాయించారు. గతంలోనూ సాయిపై పీడీ యాక్ట్ పెట్టించి ఎమ్మెల్యే శంకర్‌రావు సాయిని అక్రమంగా జైలుకు పంపించారు. ఏపీ హైకోర్టు జోక్యంతో పీడీ యాక్ట్‌ను తొలగించారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో మరోసారి సాయిని ఎమ్మెల్యే శంకర్రావు టార్గెట్ చేశారు. కంచేటి సాయి అక్రమ అరెస్ట్‌ను పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి బాష్యం ప్రవీణ్ ఖండించారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే శంకర్రావు టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని భాష్యం ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

TDP: ప్రజాగళం షెడ్యూల్ విడుదల.. 4 రోజులపాటు పర్యటనలో బిజీ కానున్న చంద్రబాబు

Pawan Kalyan: చేనేత కార్మికుడి కుటుంబం ఆత్మహత్య పట్ల పలు అనుమానాలు

TTD: ధర్మారెడ్డిపై వైఎస్‌ జగన్‌కు ఎందుకింత ప్రేమ.. ఓహో అసలు సినిమా ఇదేనా..?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 04:41 PM