Share News

PM Modi Pileru Public Meeting Live Updates: ప్రధాని మోదీ మాస్ స్పీచ్..

ABN , First Publish Date - May 08 , 2024 | 04:35 PM

PM Narendra Modi Pileru Public Meeting Live Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి దూకుడుగా ప్రచారం చేస్తోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే ఏపీలో వరుసగా పర్యటిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా పీలేరు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో

PM Modi Pileru Public Meeting Live Updates: ప్రధాని మోదీ మాస్ స్పీచ్..
PM Narendra Modi

Live News & Update

  • 2024-05-08T16:53:16+05:30

    ఆంధ్రప్రదేశ్ వికాసమే మా లక్ష్యం: మోదీ

    • ఎన్డీయే ప్రభుత్వం రాయలసీమ రైతుల స్థితిగతులను మార్చగలదు.

    • అరటి రైతులకు పులివెందులలో క్లస్టర్స్ ఏర్పాటు చేస్తాం.

    • ఏపీలో బుల్లెట్ ట్రైన్ కావాలంటే ఎన్డీయే ప్రభుత్వం రావాలని అన్నారు

  • 2024-05-08T16:45:05+05:30

    రామ మందిరం మూసివేస్తారట: ప్రధాని మోదీ

    • గల్ఫ్ దేశాల్లో భారత్ గౌరవం పెరిగిందా? లేదా?

    • దేశం నిర్మాణం కోసమే నేను రోజూ కష్టపడుతాను.

    • గత పదేళ్లలో చేసిన పనులన్నింటినీ కాంగ్రెస్ రద్దు చేస్తానంటోంది.

    • రామమందిరం నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వెనక్కి తీసుకుంటామంటోంది.

    • రామ మందిరానికి తాళం వేస్తానంటోంది కాంగ్రెస్.

    • అందుకే ఆ పార్టీ నేతలు దేశాన్ని విభజనిస్తూ మాట్లాడుతున్నారు.

  • 2024-05-08T16:44:51+05:30

    వైసీపీ ప్రభుత్వం ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

    • ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోంది.

    • ఏపీలోని మాఫియాలన్నింటికీ ఎన్డీయే ప్రభుత్వం ట్రీట్‌మెంట్ ఇస్తుంది.

    • వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది.

  • 2024-05-08T16:41:49+05:30

    ఆంధ్రప్రదేశ్‌లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి: మోదీ

    • వైసీపీ మంత్రి ఇక్కడ రౌడీ రాజ్యం నడుపుతున్నాడు.

    • శ్యాండ్ మాఫియాతో ఇక్కడ అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది.

    • ఈ విషయం నాకు చాలా ఆందోళన కలిగించింది.

    • రాయలసీమలో ఖనిజ సంపదకు కొదవలేదు.

    • టూరిజానికి ఎంతో అవకాశం ఉంది.

  • 2024-05-08T16:40:55+05:30

    వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది: ప్రధాని మోదీ

    • జలజీవన్ మిషన్‌కు ఇక్కడ ప్రభుత్వం సహకరించడం లేదు.

    • పోలవరం ప్రాజెక్టును ఏం చేశారో చూశాం.

    • రాయలసీమ ప్రాంతంలో సాగు కోసం నీటిని అందించడం లేదు.

  • 2024-05-08T16:34:22+05:30

    PM Narendra Modi Pileru Public Meeting Live Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి దూకుడుగా ప్రచారం చేస్తోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే ఏపీలో వరుసగా పర్యటిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా పీలేరు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ ప్రసంగం లైవ్ అప్‌డేట్స్ మీకోసం..