Share News

AP Election 2024: ఎన్ఆర్ఐలను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్న వైసీపీ: కోమటి జయరాం

ABN , Publish Date - Apr 22 , 2024 | 06:46 PM

ఎన్ఆర్ఐలను వైఎస్సార్సీపీ (YSRCP) టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎన్నారై యూఎస్ఏ సెల్ కోఆర్డినేటర్ కోమటి జయరాం (Komati Jayaram) అన్నారు. పోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్ఆర్ఐలు టీడీపీకి మద్దతు ఇవ్వడం దేశద్రోహమా? అని ప్రశ్నించారు.

AP Election 2024: ఎన్ఆర్ఐలను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్న వైసీపీ: కోమటి జయరాం
Komati Jayaram

అమరావతి: ఎన్ఆర్ఐలను వైఎస్సార్సీపీ (YSRCP) టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎన్ఆర్ఐ యూఎస్ఏ సెల్ కోఆర్డినేటర్ కోమటి జయరాం (Komati Jayaram) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్ఆర్ఐలు టీడీపీకి మద్దతు ఇవ్వడం దేశద్రోహమా? అని ప్రశ్నించారు. వక్రభాష్యాలు, అసత్యాలు, అబద్ధాలు చెప్పడంలో వైసీపీ నేతలు పీహెచ్‌డీలు చేశారని ఆరోపించారు. ఎన్ఆర్ఐలు ఏపీ ఎన్నికల్లో సేవ చేయాలని అనుకుంటున్నారని తాను అన్నానని చెప్పారు. అయితే ఆ వ్యాఖ్యలను కొంతమంది వైసీపీ నేతలు వక్రీకరించారని మండిపడ్డారు. వారు వక్రీకరిస్తూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కోమటి జయరాం తీవ్రంగా ఖండించారు.


Ashok babu: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైసీపీ

ఎన్ఆర్ఐలు టీడీపీకి మద్దతు ఇవ్వడమనేది దేశద్రోహమా? అని నిలదీశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రవాసాంధ్రుల సమస్యలను తీర్చేందుకు కృషి చేసిందని గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కృషి చేయడం వల్లే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు విదేశాల్లో ఉన్నారని అభివర్ణించారు. చంద్రబాబును సీఎం జగన్, వైసీపీ నేతలు ఇబ్బందులకు గురి చేశారని ధ్వజమెత్తారు. ఏపీని కుక్కలు చింపిన విస్తరిలా మార్చి దోచుకుంటున్న వైసీపీకి వ్యతిరేకంగా ఎన్ఆర్ఐలు పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు తట్టుకోలేక తనపై అభ్యతరకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కోమటి జయరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

Bride Kidnap: షాకింగ్ ఘటన.. కంట్లో కారం కొట్టి, పెళ్లికూతురిని ఈడ్చుకెళ్తూ..

Nellore: భిన్నవ్యక్తిత్వాల మధ్య పోరు.. ఎవరిదో జోరు!

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 22 , 2024 | 06:59 PM