Share News

AP Elections: ఏపీలో సంక్షేమ పథకాల నిధుల విడుదలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

ABN , Publish Date - May 09 , 2024 | 03:57 PM

Andhrapradesh: సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. సంక్షేమ పథకాలకు నిధులు నిలిపివేతపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌లు దాఖలు చేసింది. ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగగా.. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం తరపున వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.

AP Elections: ఏపీలో సంక్షేమ పథకాల నిధుల విడుదలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

అమరావతి, మే 9: సంక్షేమ పథకాలకు (welfare schemes) నిధుల విడుదలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో (AP Highcourt) వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ప్పుడో జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు ఇప్పుడు నిధులు విడుదలపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం (AP Government) హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌లు దాఖలు చేసింది. ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరుగగా.. ఎన్నికల కమిషన్ (Election Commission), ప్రభుత్వం (AP Government) తరపున వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. అంతకముందు ఎన్నికల కమిషన్ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానాలు ఇచ్చి, మళ్లీ విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించిన ఈసీ ఈరోజు కోర్టు ముందు సమాధానం ఇచ్చింది.

AP Elections 2024: కర్నూలు ‘కింగ్’ ఎవరు.. సిటీని ఏలే ఛాన్స్ ఎవరికి..!?


జనవరి నుంచి మార్చి 16 వరకు వివిధ పథకాలకు బటన్ నొక్కి, అప్పుడు నిధులు విడుదల చేయకుండా ఎన్నికలకు రెండు రోజుల ముందు నిధులు ఎలా విడుదల చేస్తారని ఈసీ ప్రశ్నించింది. సైలెంట్ పీరియడ్‌లో నిధులు విడుదల చేసేందుకు వీలు లేదని ఈసీ స్పష్టం చేసింది. దీని వల్ల లెవల్ ప్లెయింగ్ ఫీల్డ్ దెబ్బ తింటుందని పేర్కొంది. తాము ఆన్ గోయింగ్ స్కీమ్స్‌కు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. నాలుగు రోజుల్లో పోయిందే ముందని ఈనెల14వ తేదీన విడుదల చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది చెప్పారు. గతంలో తాము జూన్ 6 వరకు నిధులు విడుదల చేసేందుకు వీలు లేదని చెప్పినా, తాజాగా మాత్రం పోలింగ్ పూర్తైన తర్వాత విడుదల చేసుకోవచ్చని చెబుతున్నామని ఈసీ న్యాయవాది పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.


ఇవి కూడా చదవండి...

AP Election 2024: జిల్లాల వారీగా సర్వే వివరాలు ప్రకటించిన గోనె ప్రకాశరావు

AP Elections 2024: ‘ఫ్యాన్’ రెక్కలు ముక్కలవడం ఖాయం.. వైసీపీపై చంద్రబాబు పంచ్‌లు..

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2024 | 04:20 PM