Share News

Sunrisers Hyderabad: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. టీ20 క్రికెట్‌లో ఆల్‌టైం రికార్డ్

ABN , Publish Date - May 09 , 2024 | 03:00 PM

ఒకప్పుడు సరైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 150 పరుగుల మైలురాయిని అందుకోవడం కూడా గగనంలా అనిపించేది. కానీ.. ఈ సీజన్‌లో ఊచకోతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గాలి ఊదినంత ఈజీగా...

Sunrisers Hyderabad: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. టీ20 క్రికెట్‌లో ఆల్‌టైం రికార్డ్

ఒకప్పుడు సరైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు (Sunrisers Hyderabad) 150 పరుగుల మైలురాయిని అందుకోవడం కూడా గగనంలా అనిపించేది. కానీ.. ఈ సీజన్‌లో ఊచకోతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గాలి ఊదినంత ఈజీగా 200 పరుగుల మార్క్‌ని దాటేస్తోంది. ఇప్పటికే 260+ స్కోర్లను మూడుసార్లు నమోదు చేసి, ఈ ఘనత సాధించిన తొలిజట్టుగా ఎస్‌ఆర్‌హెచ్ (SRH) నిలిచింది. ఇప్పుడు లేటెస్ట్‌గా తన ఖాతాలో మరో చారిత్రాత్మక రికార్డ్‌ని లిఖించుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం నమోదు చేసి.. టీ20 చరిత్రలో 150కి పైగా లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేధించిన జట్టుగా సన్‌రైజర్స్ చరిత్రపుటలకెక్కింది.


LSGపై SRH గ్రాండ్ విక్టరీ.. రెండు జట్లకు గట్టి షాక్

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో (Lucknow Super Giants) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. లక్ష్య ఛేధనలో భాగంగా సన్‌రైజర్స్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 9.4 ఓవర్లలో (167) ఆ లక్ష్యాన్ని ఛేధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (89) (Travis Head), అభిషేక్ శర్మ (75) (Abhishek Sharma) కలిసి విధ్వంసం సృష్టించడం వల్లే.. సన్‌రైజర్స్ ఈ బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేయగలిగింది. ఇది కేవలం ఐపీఎల్ చరిత్రలోనే కాదు.. యావత్ టీ20 క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ ఛేజింగ్. ఇంతకుముందు ఈ ఘనత బ్రిస్బేన్ హీట్ పేరు మీద ఉండేది. మెల్‌బోర్న్ స్టార్స్ మీద ఆ జట్టు 10 ఓవర్లలోనే 157 పరుగుల లక్ష్యాన్ని ఛేధించి, టీ20 క్రికెట్‌లో 150కి పైగా లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేధించిన జట్టుగా అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్‌ని సన్‌రైజర్స్ బద్దలుకొట్టి.. నంబర్ స్పాట్‌ని కైవసం చేసుకుంది.

సంజు శాంసన్‌కు ఫైన్.. ఎందుకంటే..?

అంతేకాదండోయ్.. సిక్సుల పరంగానూ సన్‌రైజర్స్ ఆల్‌టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సీజన్‌లో ఆ జట్టు 146 సిక్సులు బాది.. ఓ సింగిల్ ఎడిషన్‌లో అన్ని సిక్సులు కొట్టిన ఏకైక జట్టుగా అవతరించింది. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 2018 ఐపీఎల్ సీజన్‌లో 145 సిక్సులతో అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్‌ని ఎస్‌ఆర్‌హెచ్ పటాపంచలు చేసింది. ఇక కేకేఆర్ (143 - 2019), ఆర్సీబీ (142 - 2016), ముంబై ఇండియన్స్ (140 - 2023) జట్లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 09 , 2024 | 03:00 PM