Share News

IPL 2024: సంజు శాంసన్‌కు ఫైన్.. ఎందుకంటే..?

ABN , Publish Date - May 08 , 2024 | 12:44 PM

రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్‌లా నిలిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్‌లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్‌కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.

IPL 2024: సంజు శాంసన్‌కు ఫైన్.. ఎందుకంటే..?
Sanju Samson

రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్‌‌కు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆర్ఆర్ ఫీల్డింగ్ తీసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత ఆచి తూచి ఆడినప్పటికీ చివరలో వికెట్లు కోల్పోవడంతో డిసి విజయం సాధించింది.


రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్‌లా నిలిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్‌లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్‌కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది. దానిని థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. దాంతో సంజు శాంసన్ తీవ్ర అసంతృప్తిగా గురయ్యాడు.


తనది ఔట్ కాదని, బౌండరి లైన్‌కు హోప్ కాలు తగిలిందని అభిప్రాయ పడ్డారు. క్రీజు వదిలి వెళ్లే సమయంలో అంపైర్‌తో ఇదే విషయం మాట్లాడారు. అంపైర్‌తో వాగ్వివాదం చేయడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు సంజు శాంసన్‌కు మ్యాచ్‌ ఫీజులో కోత విధించింది.



Read Latest
Sports News and Telugu News

Updated Date - May 08 , 2024 | 12:46 PM