Share News

Pawan Kalyan: చిరంజీవిని అవమానిస్తారా?.. జగన్‌కు టైం దగ్గరపడింది...

ABN , Publish Date - May 01 , 2024 | 03:12 PM

Andhrapradesh: ‘‘మన అభిమాన హీరో చిరంజీవినే అవమానించిన జగన్ ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం మండపేట బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతూ... ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని.. రైతాంగానికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు.

Pawan Kalyan: చిరంజీవిని అవమానిస్తారా?.. జగన్‌కు టైం దగ్గరపడింది...
Janasena Chief Pawan Kalyan Election Campaign

అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 1: ‘‘మన అభిమాన హీరో చిరంజీవినే (Megastar Chiranjeevi) అవమానించిన జగన్ (CM Jagan) ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) అన్నారు. బుధవారం మండపేట బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతూ... ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని.. రైతాంగానికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు కేటాయిస్తామన్నారు. పోలీస్, రెవిన్యూ వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో ద్వారంపూడి కుటుంబం రాష్ట్ర సంపదను దోచేస్తుందని ఆరోపించారు. 2014లో టీడీపీ(TDP), బీజేపీకి (BJP) జనసేన (Janasena) మద్దతు ఇవ్వటం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.

AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..


కులాల్ని దాటి వెళ్ళకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుందన్నారు. తోట త్రిమూర్తులు, పిల్లి బోస్‌లు రాజకీయ శత్రువులని.. ఇప్పుడు రాజకీయ అవసరాలు కోసం కలిసిపోయారన్నారు. తోట త్రిమూర్తులు జనసేనలోకి రావటం లేదని స్పష్టం చేశారు. ద్రాక్షారామలో కాపు కళ్యాణమండపం నిర్మాణం చేపడతామని చెప్పి.. స్థలం కాజేసి రెండేళ్లుగా కళ్యాణమండపం నిర్మించలేదన్నారు. ఏపీని జగన్ పాలన నుంచి విముక్తి చేయాలన్నారు.

LokSabha Elections: కొన్ని గంటల్లో అమేథీ, రాయబరేలి అభ్యర్థుల ఎంపిక


గంజాయి పండించే వైసీపీ నేతలు (YSRCP Leaders) లాభాల్లో ఉన్నారన్నారు. మూడు వేల మంది కౌలు రైతులు చనిపోయారని.. పంట నష్టం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 920 కోట్లు నష్టపోయారని తెలిపారు. మండపేట నియోజకవర్గంలో నాలుగు ఇసుక రీచ్‌లు నుంచి జగన్ నెలకు రూ.10 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. క్లాస్ వార్ అంటున్న జగన్ అందరి సంపద దోచుకుంటున్నారన్నారు. ధైర్యం లేని సమాజం చచ్చిపోతుందన్నారు. ద్వారంపూడి, తోట త్రిమూర్తులు మండపేటలో ఒక స్కూల్ మూయించివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉంటే ఒక్కొక్కరిని తొక్కి నారతీసేస్తా’’ అంటూ జనసేన అధినేత పవన్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

Janasena: గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు కొంత రిలీఫ్..

Lok Sabha Polls 2024: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 03:30 PM