Share News

Health Tips : రెడ్ మీట్, వైట్ మీట్ వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా.. !

ABN , Publish Date - May 01 , 2024 | 02:21 PM

తెల్ల మాంసం చికెన్, టర్కీ వంటి పౌల్ట్రీ నుంచి వచ్చేవన్నీ ఈ కిందకే వస్తాయి. మామూలుగా ఎరుపు మాంసంతో పోల్చితే సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్య స్పృహ కలిగిన వారు ఎక్కువగా తీసుకునే ఆహారంలో వైట్ మీట ఉంటుంది. ఇది లీన్ ప్రోటీన్, నియాసిన్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలతో ఉంటుంది.

Health Tips : రెడ్ మీట్, వైట్ మీట్ వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా.. !
red and white meats

శరీరంలో శక్తి పెరగాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తప్పక తీసుకోవాలి. అందులో ముఖ్యంగా మంచి పోషకాలున్న మీట్ ఆహారం మన ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది. అయితే ఇక్కడ ఒక్కటే ప్రశ్న మనం తీసుకునే ఆహారంలో ఏమీట్ తీసుకోవడం మంచిది. అది రెడ్ మీట్ లేదా వైట్ మీట్ ఏది మంచిది. ఇదే విషయంలో ఆరోగ్య ప్రభావాల విషయంలో భిన్నంగా అభిప్రాయాలుంటాయి. అసలు ఏది మంచిది. తెలుసుకుందాం.

రెడ్ మీట్ తీసుకోవడం వల్ల..

రెడ్ మీట్ లో గొర్రె, పంది మాంసం ఎర్రటి రంగుతో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రోటీన్, మైయోగ్లోబిన్ ఉంటుంది. ఎర్ర మాంసం ఇనుము, జింక్, విటమిన్ బి12 వంటి ముఖ్యమైన పోషకాలకు మూలం. కానీ దీనిని ఎక్కువగాతీసుకోవడం కూడా ఆరోగ్యానికి అంత మంచి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదం లేకపోలేదు.

Energy Levels : శక్తిలేనట్టుగా, అలసటగా ఉంటే తిరిగి శక్తిని పొందేందుకు ఇలా చేయండి..!

వైట్ మీట్..

తెల్ల మాంసం చికెన్, టర్కీ వంటి పౌల్ట్రీ నుంచి వచ్చేవన్నీ ఈ కిందకే వస్తాయి. మామూలుగా ఎరుపు మాంసంతో పోల్చితే సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్య స్పృహ కలిగిన వారు ఎక్కువగా తీసుకునే ఆహారంలో వైట్ మీట ఉంటుంది. ఇది లీన్ ప్రోటీన్, నియాసిన్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలతో ఉంటుంది.

ఆరోగ్యప్రయోజనాలు..

ఆరోగ్య విషయంలో గుండె ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. రెడ్ మీట్ అధిక సంతృప్త కొవ్వు పదార్థాలను గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. వైట్ మీట్ ఈ ప్రమాదాన్ని కాస్త తగ్గిస్తుంది. ఇందులోని సంతృప్త కొవ్వు పదార్థాలు కారణంగా గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.


Health Tips : షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన వేసవి పానీయాలు ఇవే..!

క్యాన్సర్..

రెడ్ మీట్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రాసెస్ చేసిన రకాలు కొలొరెక్టల్ క్యాన్సర్ తో పాటు కొన్ని క్యాన్సర్ ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ ప్రమాదానికి సంబంధించి వైట్ మీట్ మంచి ఎంపికని చెప్పవచ్చు. దీనితో ఎటువంటి ప్రమాదం ఉండదు.

పోషకాహారం..

ఎరుపు, తెలుపు మాంసాలలో పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇందులో రెడ్ మీట్లో ఇనుము, విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇది రక్త ఆరోగ్యానికి, నరాల పనితీరుకు అవసరం. వైట్ మీట్ తక్కువ కేలరీలు, సంతృప్త కొవ్వులను కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు, ఆరోగ్యానికి అవసరం.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 01 , 2024 | 02:21 PM