Share News

AP Election Results 2024: సీఎం.. సీఎం అంటూ నినాదాలు.. రేపు సంబరాలు చేసుకుందామన్న సీబీఎన్!

ABN , Publish Date - Jun 03 , 2024 | 04:10 PM

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళగిరిలోని ఎన్డీఆర్ భవన్‌కు సోమవారం వచ్చారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పోలీసులు గౌరవ వందనం పలికారు. ‘జై చంద్రబాబు.. సీఎం చంద్రబాబు’ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.

AP Election Results 2024: సీఎం.. సీఎం అంటూ నినాదాలు.. రేపు సంబరాలు చేసుకుందామన్న సీబీఎన్!
Nara Chandrababu Naidu

అమరావతి: తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళగిరిలోని ఎన్డీఆర్ భవన్‌కు సోమవారం వచ్చారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పోలీసులు గౌరవ వందనం పలికారు. ‘జై చంద్రబాబు.. సీఎం చంద్రబాబు’ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. సంబరాలు రేపు చేసుకుందామని.. శక్తిని అప్పుడే ఖర్చు చేసుకోవద్దంటూ శ్రేణులతో చంద్రబాబు చమత్కరించారు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ కేంద్ర కార్యాలయం సందడి వాతావరణంగా మారింది.


అభినందనలు

ఈ సందర్భంగా పార్టీ బ్యాకాఫీస్‌లో పనిచేసిన నేతలను చంద్రబాబు అభినందించారు. ఎన్నికల్లో తన పర్యటనలు కోఆర్డినేట్ చేసిన బృంద సభ్యులను అభినందించారు. పెందుర్తి వెంకటేష్, పరుచూరి కృష్ణ, బండారు హనుమంతరావు, గంటా గౌతమ్, రవి యాదవ్, రాజశేఖర్, శ్రీనివాస్ చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని కోఆర్డినేట్ చేశారు. ప్రచారంలో భాగంగా రోజుకు 3 నుంచి 5 కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనేలా ఈ బృందం సమన్వయం చేసింది. బాగా కష్టపడి పని చేశారంటూ బృంద సభ్యులను తన నివాసంలో చంద్రబాబు అభినందించారు.


సైకిల్‌ దినోత్సవం సందర్భంగా...

TDP.jpg

ప్రపంచ సైకిల్‌ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌లో తాను సైకిల్‌ తొక్కుతున్న ఫొటోను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ గుర్తు కూడా సైకిల్‌ కావడంతో.. సైక్లింగ్‌ వ్యక్తులకు, సమాజానికి మంచిదని తెలిపారు. అయితే.. టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు మరికాసేపట్లో సమావేశం కానున్నట్లు సమాచారం.


కౌంటింగ్‌పై దిశానిర్దేశం

ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న జరిగిన విషయం తెలిసిందే. రేపు(మంగళవారం) ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నిక‌ల కౌంటింగ్‎కు మ‌రికొన్ని గంట‌ల స‌మ‌యం మాత్రమే ఉండ‌టంతో నేత‌లు అల‌ర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నేతలకు పలు సూచనలు, సలహాలు చంద్రబాబు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


అభ్యర్థుల‌తో పాటు ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల‌పై దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో ఎన్డీయే కూట‌మిదే విజయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ చేస్తున్న రాద్దాతం అంతా ఇంతా కాదు. అ విషయంలో టీడీపీ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సుప్రీం కోర్టులో వైసీపీకి చుక్కెదురు..

న్యాయమైన కోరికలు తీరుస్తా: మంత్రి పొంగులేటి

బానిసత్వాన్ని తెలంగాణ భరించదు:సీఎం

మరో బాదుడు మొదలుపెట్టిన జగన్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 03 , 2024 | 05:49 PM