Share News

AP Elections: పిన్నెల్లికి ఏపీ హైకోర్టు షాక్..? ఏం చెప్పిందంటే..?

ABN , Publish Date - May 24 , 2024 | 07:51 PM

మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి(Pinnelli Ramakrishna Reddy) ఏపీ హైకోర్టులో(AP High Court) భారీ షాక్ తగిలింది. ఆయన కదలికల‌పై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్ల కూడదని ఆదేశాలు జారీ చేసింది.

 AP Elections: పిన్నెల్లికి ఏపీ హైకోర్టు షాక్..? ఏం చెప్పిందంటే..?
Pinnelli Ramakrishna Reddy

అమరావతి: మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి (Pinnelli Ramakrishna Reddy) ఏపీ హైకోర్టులో (AP High Court) భారీ షాక్ తగిలింది. ఆయన కదలికల‌పై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్ల కూడదని ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోనే వచ్చే నెల 6వ తేదీ వరకు ఉండాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ కేంద్రానికి‌ వెళ్లేందుకు ఆరోజు మాత్రమే హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ‌ కేసు‌ విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో ఎలాంటి ఇంటర్వ్యూ లు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది.


సాక్షులతో మాట్లాడేందుకు కూడా వీలు లేదని హైకోర్టు తెలిపింది. పిన్నెల్లి కదలికలపై పూర్తి స్థాయి నిఘా విధించాలని పోలీసు అధికారులకు స్పష్టం చేసింది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎం, వీవీ ప్యాట్‌లను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.


సోషల్ మీడియాతో వైరల్ అవడంతో పిన్నెల్లి‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. పిన్నెల్లి హైదరాబాద్‌లో ఉన్నారని సమచారం రావడంతో ఏపీ పోలీసులు తనిఖీలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోదీకి పదవీకాంక్ష పీక్స్‌కు చేరింది: కూనంనేని

బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాను

మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!

పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్

Read Latest APNews and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 24 , 2024 | 08:12 PM