Funny Video: ఓ వ్యక్తి అతి తెలివి.. హెల్మెట్ స్ట్రిప్ తెగిపోతే తాడును కట్టేశాడు.. చూసి అవాక్కైన పోలీసులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-03-11T18:46:08+05:30 IST

హెల్మెట్ ధరించాలంటూ పోలీసులు పదే పదే సూచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు జరిమానాలు వేసి మరీ హెచ్చరిస్తుంటారు. అయినా వాహనదారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరైతే హెల్మెట్ ఉన్నా ధరించకుండా, బైక్‌కు వేలాడదీస్తుంటారు. పోలీసులు కనపడితే..

Funny Video: ఓ వ్యక్తి అతి తెలివి.. హెల్మెట్ స్ట్రిప్ తెగిపోతే తాడును కట్టేశాడు.. చూసి అవాక్కైన పోలీసులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

హెల్మెట్ ధరించాలంటూ పోలీసులు పదే పదే సూచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు జరిమానాలు వేసి మరీ హెచ్చరిస్తుంటారు. అయినా వాహనదారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొందరైతే హెల్మెట్ ఉన్నా ధరించకుండా, బైక్‌కు వేలాడదీస్తుంటారు. పోలీసులు కనపడితే మాత్రం ఇలా పెట్టుకుని, తర్వాత అలా తీసేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. ఇందుకు పూర్తి విరుద్ధమనే చెప్పాలి. హెల్మెట్ స్ట్రిప్ తెగిపోయినా.. తాడు కట్టి మరీ హెల్మెట్‌ను ధరించాడు. ఇతన్ని చూసి ఏకంగా పోలీసులే అవాక్కయ్యారు. చివరకు ఏం జరిగిందంటే...

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. పంజాబ్‌లోని (Punjab) లూథియానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వాహనాల తనిఖీలో ఉండగా.. ఓ యువకుడు బైకుపై (bike) నేరుగా అక్కడికి వస్తాడు. హెల్మెట్ (Helmet) ధరించడంతో పాటూ అన్ని నిబంధనలు పాటించినా.. అతన్ని చూడగానే పోలీసులకు అనుమానం వస్తుంది. ఆపి నిశితంగా పరిశీలించి, హెల్మెట్ స్ట్రిప్‌కు (Helmet Strip) బదులుగా ప్లాస్టిక్ తాడు కట్టి ఉండడాన్ని చూసి అవాక్కవుతారు. చివరకు అతడి సమస్యను తెలుసుకోవడంతో పాటూ చిత్తశుద్ధిని చూసి మెచ్చుకుంటారు. ఓ పోలీసు (police) స్వయంగా తాడును విప్పి, హెల్మెట్ తీసేస్తాడు.

Fridge Cooling Problem: ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్ బాటిల్ అస్సలు కూల్ అవడం లేదా..? ఈ సమస్యకు పరిష్కారమిదే..!

హెల్మెట్‌ను తీసుకున్న పోలీసులు.. ఏమంటాడో ఏమో అని సదరు యువకుడు భయపడుతూ ఉంటాడు. అతడి హెల్మెట్‌ను తీసుకున్న పోలీసు.. పక్కనున్న సిబ్బందికి సైగ చేస్తాడు. దీంతో వెంటనే అతను కొత్త హెల్మెట్ తీసుకొస్తాడు. దాన్ని సదరు పోలీసు.. స్వయంగా యువకుడి తలపై ధరింపజేస్తాడు. తర్వాత వెన్నుతట్టి ప్రోత్సహించి అక్కడి నుంచి పంపిస్తాడు. పోలీసు చేసిన పని చూసి యువకుడు.. అతడి కాళ్లు పట్టుకుని ధన్యవాదాలు తెలియజేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. యువకుడి చిత్తశుద్ధిని కొందరు మెచ్చుకుంటుంటే.. పోలీసు మంచి మనసుకు ఫిదా అయ్యామంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Digital Payments in Wedding: పెళ్లి వేడుకలో QR Code బోర్డ్.. స్కాన్ చేసి ఓ బంధువు ఎంత పంపించాడో తెలిసి అవాక్కైన వధూవరులు..!

Updated Date - 2023-03-11T18:52:40+05:30 IST