Fridge Cooling Problem: ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్ బాటిల్ అస్సలు కూల్ అవడం లేదా..? ఈ సమస్యకు పరిష్కారమిదే..!

ABN , First Publish Date - 2023-03-11T16:28:39+05:30 IST

వేసవికాలం వచ్చేసింది. ఇకనుంచి రోజురోజుకూ ఎండలు పెరిగిపోతూ ఉంటాయి. దీంతో ఈ కాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఇక ఇళ్లల్లో ఫ్రిడ్జ్‌ల నిండా వాటర్ బాటిళ్లను కుక్కేస్తుంటారు. ఒకవేళ ఈ వేసవిలో ఫ్రిడ్జ్ ఏమాత్రం పని చేయకున్నా..

Fridge Cooling Problem: ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్ బాటిల్ అస్సలు కూల్ అవడం లేదా..? ఈ సమస్యకు పరిష్కారమిదే..!

వేసవికాలం వచ్చేసింది. ఇకనుంచి రోజురోజుకూ ఎండలు పెరిగిపోతూ ఉంటాయి. దీంతో ఈ కాలంలో చల్లని పానీయాలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఇక ఇళ్లల్లో ఫ్రిడ్జ్‌ల నిండా వాటర్ బాటిళ్లను కుక్కేస్తుంటారు. ఒకవేళ ఈ వేసవిలో ఫ్రిడ్జ్ ఏమాత్రం పని చేయకున్నా.. తెగ గాబరా పడిపోతుంటారు. వెంటనే మెకానిక్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే ఫ్రిజ్ కూల్ కాకపోవడానికి గల చిన్న చిన్న సమస్యలను మీకు మీరే ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. అవేంటో పూర్తిగా తెలుసుకుందాం..

refrigerator.jpg

సాధారణంగా పాత ఫ్రిడ్జ్‌లకు (Old fridge) ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఫ్రిడ్జ్ డోర్ తీయగానే బల్బు వెలుగుతుంది. కానీ లోపల చల్లదనం మాత్రం ఉండదు. అరే! ఇదేంటీ బల్బు వెలుగుతుంది.. కానీ ఎందుకు ఫ్రిడ్జ్ కూల్ అవ్వడం లేదని చాలా మందికి సందేహం రావొచ్చు. అయితే బల్బు వెలగడానికి, ఫ్రిడ్జ్ కూల్ కాకపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. కూలింగ్ కాని సమయంలో ముందుగా కండెన్సర్ ఫ్యాన్‌ సరిగ్గా పని చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ వెనుక భాగంలో ఉండే పైప్ లైన్ మధ్యలో ధుమ్ము,ధూళి చేరుకోవడం వల్ల కూడా కూలింగ్ సమస్య రావొచ్చు. కాబట్టి ముందుగా కండెన్సర్, కాయిల్స్‌ను శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ కండెన్సర్ పాడై ఉంటే మార్చుకోవాల్సి ఉంటుంది.

Viral Video: ఎవరూ లేని సమయం చూసి.. బైకుపై కూర్చున్న బాలిక.. అపవిత్రమైందంటూ చివరకు యజమాని చేసిన పని..

refrigerator-problems.jpg

ఫ్రిడ్జ్ ఎవాపరేటర్‌లో ఆయిల్ చేరడం వల్ల కూడా కూలింగ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మాత్రం మెకానిక్‌ను సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలి. ఫ్రిడ్జ్ వెనుక భాగంలోని కాయిల్స్ పూర్తిగా మంచుతో కప్పబడిపోవడం వల్ల కూడా కూలింగ్ సమస్య (Cooling problem) వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఫ్రిడ్జ్‌ను ఆఫ్ చేసి, కాయిల్స్‌ను బయటికి తీసి, మంచు కరిగే వరకూ ఆరబెట్టాలి. తర్వాత వాటిని శుభ్రం చేసి, యథావిధిగా అమర్చాలి. అదేవిధంగా ఫ్రిడ్జ్ కూల్ కాకపోవడానికి మరో ప్రధాన కారణం.. ఫ్రిడ్జ్ వెనుక కింద భాగంలో ఉండే కంప్రెసర్ రన్ కాకపోవడం. అందువల్ల ముందుగా కంప్రెసర్ రన్ అవుతుందా, లేదా అని తెలుసుకోవాలి.

Marriage Photos: అయ్యబాబోయ్.. ఇలాంటి బంధువులు ఉంటే ఇక పెళ్లిళ్లు అయినట్టే.. వరుడికే చిర్రెత్తుకొచ్చి పెళ్లిని ఆపేసినంత పనిచేశాడు..!

refrigerator-photos.jpg

ఫ్రిడ్జ్‌కు సంబంధించిన థర్మోస్టాట్ స్విచ్ మరమ్మతులకు గురైన సందర్భంలో కంప్రెసర్ పని చేయదు. ఒకవేళ కంప్రెసర్ పని చేస్తున్నా.. ఫ్రిడ్జ్ కూల్ అవలేదంటే వేరే సమస్య ఉందని అర్థం. మరోవైపు ఫ్రిజ్డ్ వెనుక భాగంలో ఉండే కెపాజిటర్, ఓఎల్పీ, రిలే అనే మూడు చిన్న వస్తువులు పని చేస్తున్నాయా, లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ వాటిలో ఏదైనా పాడై ఉంటే మార్చుకోవాల్సి ఉంటుంది. వెనుక వైపున ఉండే ఫ్యాన్ లేదా మోటార్ పాడైతే.. కొత్త వాటిని మార్చుకోవడం వల్ల సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Digital Payments in Wedding: పెళ్లి వేడుకలో QR Code బోర్డ్.. స్కాన్ చేసి ఓ బంధువు ఎంత పంపించాడో తెలిసి అవాక్కైన వధూవరులు..!

Updated Date - 2023-03-11T16:35:57+05:30 IST