సోషల్ మీడియా ద్వారా యువతితో పరిచయం.. ఎలాగైనా ఆమెను కలవాలనే ఉద్దేశంతో ఓ రోజు రాత్రి.. షాపు షట్టర్ తొలగించి..
ABN , First Publish Date - 2023-01-15T20:08:24+05:30 IST
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడో జరిగే చిన్న చిన్న ఘటనలు కూడా మన వరకూ చేరిపోతున్నాయి. అలాగే ఎక్కడెక్కడో ఉన్న వారు కూడా స్నేహితులుగా మారిపోతుంటారు. ఈ క్రమంలో..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడో జరిగే చిన్న చిన్న ఘటనలు కూడా మన వరకూ చేరిపోతున్నాయి. అలాగే ఎక్కడెక్కడో ఉన్న వారు కూడా స్నేహితులుగా మారిపోతుంటారు. ఈ క్రమంలో యవతీయువకుల మధ్య ఏర్పడే పరిచయాలు.. చివరకు ప్రేమగా రూపాంతరం చెందుతుంటాయి. జార్ఖండ్‌కు చెందిన ఓ బాలుడికి పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఎలాగైనా ఆమెను కలవాలనే ఉద్దేశంతో ఓ రోజు షాపు షట్టర్ తొలగించి అతడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్ (Jharkhand) పరిధి చైబాసాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ బాలుడికి.. కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్‌కు (West Bengal) చెందిన ఓ యువతి (young woman), సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరూ రోజూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. చివరకు సదరు బాలుడు.. ఎలాగైనా ఆమెను కలవాలని నిర్ణయింకున్నాడు. అయితే పశ్చిమబెంగాల్ వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో వాయిదా వేస్తూ వచ్చాడు. రోజూ మాట్లాడుతుండడంతో ఇటీవల ఏం చేసైనా.. ఆమెను కలవాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకోసం ఏకంగా చోరీకే ప్లాన్ వేశాడు. టాంబో చౌక్‌లో ఉన్న మొబైల్ దుకాణాన్ని టార్గెట్ చేశాడు.
జనవరి 12న రాత్రి.. తన స్నేహితులతో కలిసి షట్టర్ పగులగొట్టి లోపలికి వెళ్లారు. మొత్తం 105 ఖరీదైన ఫోన్లను (Theft of phones) ఎత్తుకెళ్లారు. ఉదయం చోరీ విషయం తెలుసుకున్న షాపు యజమాని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. ఎట్టకేలకు 24గంటల్లో కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. నేరం అంగీకరించడంతో బాలుడితో సహా మొత్తం ఐదు మందిపై కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు మైనర్ల కోసం గాలిస్తున్నారు. చోరీ చేసిన ఫోన్లు.. సుమరు రూ.20లక్షల విలువ చేస్తాయని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
భర్త పట్టించుకోకవడంతో దూరంగా ఉంటున్న భార్య.. ఓ రోజు ఎవరూ లేని సమయంలో స్నేహితులతో కలిసి..