డబ్బులు తీసుకుని పరాయి వ్యక్తులను భార్య వద్దకు పంపిన భర్త.. ఓ రోజు స్థానికులు వెళ్లి ఉడుకుతున్న బానలిలో చూడగా..

ABN , First Publish Date - 2023-01-15T16:53:51+05:30 IST

దురలవాట్లకు బానిసలైన వారు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చివరకు ఎంతకైనా తెగిస్తుంటారు. కొందరైతే మన, తన అనే భేదం లేకుండా దారుణాలకు తెగబడుతుంటారు. ఇందుకు సాక్షంగా రోజూ ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇటీవల..

డబ్బులు తీసుకుని పరాయి వ్యక్తులను భార్య వద్దకు పంపిన భర్త.. ఓ రోజు స్థానికులు వెళ్లి ఉడుకుతున్న బానలిలో చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

దురలవాట్లకు బానిసలైన వారు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చివరకు ఎంతకైనా తెగిస్తుంటారు. కొందరైతే మన, తన అనే భేదం లేకుండా దారుణాలకు తెగబడుతుంటారు. ఇందుకు సాక్షంగా రోజూ ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇటీవల పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి డబ్బులు తీసుకుని పరాయి వ్యక్తులను తన భార్య వద్దకు పంపించేవాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో దాడి చేశాడు. ఇటీవల అతడు చేసిన నిర్వాకంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఉడుకుతున్న బానలిలో చూసి షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

తన పెళ్లికి ఐదు మంది మాజీ ప్రియుళ్లను ఆహ్వానించిన వధువు.. నేమ్ ప్లేట్ రాయించి మరీ.. ఆమె చేసిన పని..

పాకిస్తాన్ (Pakistan) కరాచీ పరిధి గుల్షన్-ఎ-ఇక్బాల్ అనే ప్రాంతంలో ఆషిక్ హుస్సేన్.. భార్య నర్గీస్, ఆరు మంది పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. నిర్మానుష్యమైన ఈ ప్రదేశంలో ఉన్న ఓ పాఠశాలను మూసేశారు. దీంతో ఆ భవనాన్ని చూసుకునేందుకు దాని యజమాని.. ఆషిక్ హుస్సేన్‌ని నియమించుకున్నాడు. దీంతో ఆషిక్.. తన కుటుంబంతో పాటూ ఆ భవనం వద్దే ఉంటున్నాడు. ఇదిలావుండగా, తాగుడుకు అలవాటు పడ్డ (Addicted to drinking) ఆషిక్.. డబ్బుల కోసం దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. భార్యతో వ్యభిచారం చేయించాలని భావించాడు. ఓ రోజు పరాయి వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని, వారిని రాత్రి వేళ భార్య వద్దకు పంపాడు. కొత్త వ్యక్తులు ఇంట్లోకి రావడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. లోపలికి వెళ్లిన వారు ఆమెపై అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డారు.

పదే పదే బ్రతిమాలినా పట్టించుకోని భార్య.. ఆమెను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో.. ఓ రోజు..

మరుసటి రోజు విషయం తెలుసుకున్న ఆమె.. భర్తను నిలదీయడంతో, రోజూ ఇలాంటి పనే చేయాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. చచ్చినా ఈ పని చేయనంటూ ఆమె తెగేసి చెప్పింది. ఈ విషయమై ఇటీవల ఓ రోజు మళ్లీ ఇద్దరి మధ్య గొడవ (quarrels) జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆషిక్.. భార్యను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆమె అరుపులకు నిద్ర లేచిన పిల్లలు.. ఈ ఘటన చూసి కళ్లు తిరిగి పడిపోయారు. భార్యను హత్య చేసిన అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, వంట గదిలో ఉన్న బానలిలో వేసి ఉడకబెట్టాడు. మెలకువలోకి వచ్చిన పిల్లలు.. పరుగెత్తుకుంటూ వెళ్లి చుట్టు పక్కల వారికి తెలియజేశారు. స్థానికులు అక్కడికి వెళ్లి బానలిలో ఉడుకుతున్న మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.

వివాహితతో కలిసి బ్యాంకు పని మీద బయటికి వెళ్లిన సహోద్యోగి.. తిరుగు ప్రయాణంలో అడవి మధ్యలో చీకటి పడడంతో..

Updated Date - 2023-01-15T16:53:55+05:30 IST