Viral Video: వచ్చారు, మార్చుకున్నారు, వెళ్లారు.. వీరి టాలెంట్ చూస్తే షాకవుకుండా ఉండలేరు..

ABN , First Publish Date - 2023-03-26T21:08:40+05:30 IST

ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కోలా ఉంటుంది. కొందరు ఇతరులకు భిన్నంగా వినూత్నమైన విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. మరింకొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. వీటిలో కొన్ని..

Viral Video: వచ్చారు, మార్చుకున్నారు, వెళ్లారు.. వీరి టాలెంట్ చూస్తే షాకవుకుండా ఉండలేరు..

ఒక్కొక్కరి టాలెంట్ ఒక్కోలా ఉంటుంది. కొందరు ఇతరులకు భిన్నంగా వినూత్నమైన విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. మరింకొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. వీటిలో కొన్ని అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి నవ్వు తెప్పించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా కాలం క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో.. ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వచ్చారు.. మార్చుకున్నారు.. వెళ్లారు.. వీళ్లు మరీ విచిత్రంగా ఉన్నారే.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు చేసిన పని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. లుంగీ (lungi) కట్టుకున్న ఓ వ్యక్తి బెంచ్‌పై కూర్చుని ఉంటాడు. మరో వ్యక్తి కూడా లుంగీ కట్టుకుని బైకులో అక్కడికి వస్తాడు. సరాసరి కూర్చున్న వద్దకు వెళ్తాడు. ఆ వ్యక్తి కూడా పైకి లేచి.. దొంగచాటుగా ఏవో వస్తువులు మార్చుకున్నట్లుగా షో చేస్తారు. కానీ చివరకు చూస్తుండగానే క్షణాల్లో ఒకరి లుంగీ మరొకరు చకచకా మార్చుకుంటారు.

Viral Video: మండుతున్న పెనం మీద కూర్చుని ఆశీర్వదిస్తున్న బాబా.. విషయం వారికి తెలియడంతో.. చివరికి..

లుంగీ మార్చుకున్న వ్యక్తి.. అంతే వేగంగా బైకు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వీరి టాలెంట్ చూసి అక్కడే ఉన్న వారంతా నవ్వుకుంటారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో (Social media) షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఫన్నీ ఫన్నీ కామెంట్లు (Funny comments) పెడుతున్నారు. లుంగీలు ఇలా మార్చడం మేమెక్కడా చూల్లేదే.. అంటూ కొందరు, రెప్పపాటులో ఎంత మాయ చేశారు.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral news: టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు.. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కాసేపటికి ప్రియుడు వెళ్లి చూడగా..

Updated Date - 2023-03-26T21:08:40+05:30 IST