Viral Video: ఏనుగుకు చిర్రెత్తుకొస్తే ఇలాగే ఉంటుంది మరి.. అంతపెద్ద చెట్టును గడ్డిపోచలా ఎలా పీకిపడేసిందో చూడండి..

ABN , First Publish Date - 2023-10-11T15:17:06+05:30 IST

ఏనుగులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో.. కోపం వస్తే అంతే స్థాయిలో బీభత్సం సృష్టిస్తుంటాయి. ఆ సమయంలో వాటిని నియంత్రించడం ఎవరితరమూ కాదు. ఏనుగులు ఆగ్రహంగా ఉన్న సమయంలో ఏ జంతువూ వాటి వద్దకు వెళ్లే సాహసం కూడా చేయదు. అడవుల నుంచి జనావాసాల్లోకి చొరబడే ఏనుగులు కొన్నిసార్లు...

Viral Video: ఏనుగుకు చిర్రెత్తుకొస్తే ఇలాగే ఉంటుంది మరి.. అంతపెద్ద చెట్టును గడ్డిపోచలా ఎలా పీకిపడేసిందో చూడండి..

ఏనుగులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో.. కోపం వస్తే అంతే స్థాయిలో బీభత్సం సృష్టిస్తుంటాయి. ఆ సమయంలో వాటిని నియంత్రించడం ఎవరితరమూ కాదు. ఏనుగులు ఆగ్రహంగా ఉన్న సమయంలో ఏ జంతువూ వాటి వద్దకు వెళ్లే సాహసం కూడా చేయదు. అడవుల నుంచి జనావాసాల్లోకి చొరబడే ఏనుగులు కొన్నిసార్లు రచ్చరచ్చ చేస్తుంటాయి. ఆటోలు, జీపులు, కార్లను ఎత్తి కిందపడేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగుకు ఉన్నట్టుండి పట్టరాని కోపం వచ్చింది. ఈ క్రమంలో చివరకు రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టును అవలీలగా పీకి కిందపడేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఏనుగుకు ఉన్నట్టుండి విపరీతమైన కోపం (angry elephant) వచ్చినట్టుంది. వెంటనే రోడ్డుపై వాహనాలు వెళ్లకుండా ఆపేయాలనుకుందో ఏమో గానీ.. అటవీ ప్రాంతంలోని రోడ్డు వద్దకు వచ్చేసింది. అక్కడికి వచ్చిన ఏనుగుకు తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో మొదట అర్థం కానట్టుంది. చివరకు దానికి రోడ్డు పక్కన ఓ పెద్ద చెట్టు కనిపించింది. ఇంకేముందీ, ఆవేశంగా చెట్టు వద్దకు వెళ్లిన ఏనుగు.. తన తొండంతో మొదట చెట్టు మధ్యలో గట్టిగా పట్టుకుంది. తర్వాత పలుమార్లు చెట్టును బలంగా ఊపుతూ చివరకు (elephant uprooting big tree) మొదలుతో సహా విరిచేసి రోడ్డుపై పడేసింది.

Crime news: ఇంటి దగ్గర దిగబెట్టే క్రమంలో బావతో కలిసి మందు తాగిన మరదలు.. అయితే కాసేపటికి మరో నలుగురు రావడంతో..

ఇలా తన కోపం చల్లార్చుకున్న ఏనుగు తర్వాత అక్కడి నుంచి మరోవైపు వెళ్లిపోయింది. ఏనుగు ఆవేశాన్ని గమనించిన వాహనదారులు దూరంగా నిలుపుకొని చూస్తూ ఉన్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఏనుగును చూస్తుంటే భయమేస్తోంది’’.. అని కొందరు, ‘‘ఏనుగా మజాకా’’.. అని మరికొందరు, ‘‘వాహనాలు వెళ్లడం ఇష్టం లేదేమో’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బైకుపై వెళ్తూ కారునే ఓవర్‌టేక్ చేసిన యువకుడు.. కాస్త ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా షాకింగ్ సీన్.. చివరకు..

Updated Date - 2023-10-11T15:17:06+05:30 IST