Crime news: కళాశాల బాత్రూంలు శుభ్రం చేస్తూ రోజూ స్వీపర్ చేసే నిర్వాకం.. ఓ రోజు బాలికలు తెలివిగా లోపలికి వెళ్లి చూడగా..

ABN , First Publish Date - 2023-10-08T20:29:15+05:30 IST

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో గోడలకు చెవులే కాదు కళ్లు కూడా ఉంటాయన్నది వాస్తవం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చివరకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ప్రధానంగా మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవల..

Crime news: కళాశాల బాత్రూంలు శుభ్రం చేస్తూ రోజూ స్వీపర్ చేసే నిర్వాకం.. ఓ రోజు బాలికలు తెలివిగా లోపలికి వెళ్లి చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

Crime news: కళాశాల బాత్రూంలు శుభ్రం చేస్తూ రోజూ స్వీపర్ చేసే నిర్వాకం.. ఓ రోజు బాలికలు తెలివిగా లోపలికి వెళ్లి చూడగా..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో గోడలకు చెవులే కాదు కళ్లు కూడా ఉంటాయన్నది వాస్తవం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చివరకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ప్రధానంగా మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవల, మహిళలను రహస్యంగా వీడియోలు తీయడం, వాటి ఆధారంగా చివరకు వారి జీవితాలను నాశనం చేయడం ఎక్కువవుతోంది. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోజే వెళ్లే బాత్రూంలే అయినా ఆ రోజు బాలికలు ఎందుకో అనుమానం కలిగింది. దీంతో మొత్తం పరిశీలించగా.. చివరకు షాకింగ్ దృశ్యం కనిపించింది.

ఢిల్లీలోని (Delhi) ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కళాశాలలో ఓ 20 ఏళ్ల యువకుడు కాంట్రాక్ట్ పద్ధతిన స్వీపర్‌గా పని చేస్తున్నాడు. పైకి మాత్రం తన పని తాను చేసుకుంటున్నట్లుగా కనిపించే ఇతను.. లోలోపల మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించేవాడు. బాత్రూంలు శుభ్రం చేసే క్రమంలో అతడి బుద్ధి పక్కదారి పట్టింది. బాలికలకు అనుమానం రాకుండా బాత్రూంలలో కెమెరాలు పెట్టేవాడు. ఇలా చాలా రోజుల నుంచి బాలికలను వీడియోలు తీస్తూ వచ్చాడు. ఇన్నాళ్లూ ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు పడ్డాడు.

Viral Video: పెళ్లి రోజే వధువుకు షాకింగ్ సీన్... అనుమానం వచ్చి పరుగు పరుగున వెళ్లి క్యారవ్యాన్‌లోకి తొంగిచూడగా..

అయితే ఇటీవల కొన్ని రోజులుగా బాలికలను అనుమానం కలుగుతూ ఉంది. దీంతో ఓ రోజు బాత్రూం వెళ్లగానే ముందుగా మొత్తం వెతికారు. ఈ క్రమంలో వారికి లోపల మొబైల్ కనిపించింది. అదే సమయంలో బయటికి వచ్చి చూడగా స్వీపర్ కూడా ఉన్నాడు. దీంతో వారు ఈ విషయాన్ని వెంటనే కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అతన్ని పట్టుకున్న వారు చివరకు పోలీసులకు అప్పగించారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఫోన్‌లో పరిశీలించంగా చాలా మంది అమ్మాయిల ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. అమ్మాయిలే లేని సమయంలో కెమెరా ఏర్పాటు చేయడం, వారు వెళ్లగానే తిరిగి తెచ్చుకోవడం చేస్తుండేవాడని విచారణలో తెలిసింది. కాగా, ఈ ఘటనతో ఒక్కసారిగా విద్యార్థినులతో పాటూ వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Indian Railway: రైల్లో సీట్లోంచి సడన్‌గా లేచిన 19 ఏళ్ల కుర్రాడు.. ఎదురుగా కూర్చున్న దంపతులనే చూస్తూ.. అందరూ చూస్తుండగానే..!

Updated Date - 2023-10-08T20:29:15+05:30 IST