Shocking Twist: నా ప్రేయసి కోపంగా ఉంది.. ఏం చేయాలంటూ జ్యోతిష్కుడిని కలిసిన ఇద్దరు కుర్రాళ్లు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-10-07T18:44:13+05:30 IST

చాలా మంది జ్యోతిష్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేయడం చూస్తూ ఉంటాం. కొందరు ఇంట్లో పూజలు చేసే క్రమంలో మత్తుమంది ఇచ్చి చోరీలకు పాల్పడిన ఘటనలను కూడా చూశాం. అయితే తాజాగా...

Shocking Twist: నా ప్రేయసి కోపంగా ఉంది.. ఏం చేయాలంటూ జ్యోతిష్కుడిని కలిసిన ఇద్దరు కుర్రాళ్లు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది జ్యోతిష్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేయడం చూస్తూ ఉంటాం. కొందరు ఇంట్లో పూజలు చేసే క్రమంలో మత్తుమంది ఇచ్చి చోరీలకు పాల్పడిన ఘటనలను కూడా చూశాం. అయితే తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. అందరి సమస్యలకూ పరిష్కారం చెప్పే జ్యోతిష్కుడికే విచిత్ర సమస్య వచ్చి పడింది. అతడి వద్దకు వచ్చిన ఇద్దరు కుర్రాళ్లలో ఓ వ్యక్తి.. నా ప్రేయసి కోపంగా ఉంది.. ఏం చేయాలంటూ జ్యోతిష్కుడిని కోరాడు. చివరకు వారు చేసిన పనితో అతను షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌‌లోని (Uttar Pradesh) కాన్పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్లుగా జ్యోతిష్యం చెబుతున్నాడు. దీంతో ఇతడి వద్దకు నిత్యం ఎంతో మంది వివిధ రకాల సమస్యలతో వస్తుంటారు. అందరి సమస్యలకూ పరిష్కారం చెబుతున్న ఈ జ్యోతిష్కుడికి (astrologer).. తాజాగా ఊహించని సమస్య వచ్చి పడింది. కొన్ని రోజుల క్రితం ఇద్దరు యువకులు.. జ్యోతిష్కుడి వద్దకు వచ్చారు. వారిలో ఓ యువకుడు మాట్లాడుతూ.. తన ప్రేయసి తనపై కోపంగా ఉందని, శాంతింపజేసే మార్గం సూచించమని కోరాడు. దీంతో వారిని అక్టోబర్ 2న రమ్మని పిలిచాడు. దీంతో వారు సోమవారం మళ్లీ జ్యోతిష్కుడి వద్దకు వచ్చారు.

Shocking Video: ఈ స్కూల్లో అమ్మాయిలకు ఏమైంది..? ఒకేసారి 95 మందికి పక్షవాతం.. నడవలేని స్థితిలో..!

జ్యోతిష్కుడు పూజలు మొదలుపెడుతున్న సమయంలో యువకులు తమ వద్ద ఉన్న శీతలపానీయాన్ని గ్లాసులో పోసి అతడికి ఇచ్చారు. ఇది తాగిన కొద్దిసేపటికి జ్యోతిష్కుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తర్వాత అతడి ఇల్లు మొత్తం వెతికిన యువకులు.. చివరకు లక్షల రూపాయల నగదు, నగలు (Jewelry Cash Theft), రెండు మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు అపహరించారు. వెళ్తూ వెళ్తూ వారి ఇంట్లో అమర్చిన సీసీ టీవీ డీవీఆర్‌ను కూడా ఎత్తుకెళ్లారు. స్పృహలోకి వచ్చిన అతను విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు యువకుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? పక్కోళ్ల ప్రాణాలకు కూడా రిస్కే.. ఒకే బైకుపై ఏడుగురు ఎలా వెళ్తున్నారో చూస్తే..!

Updated Date - 2023-10-07T18:44:13+05:30 IST