Viral Video: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? పక్కోళ్ల ప్రాణాలకు కూడా రిస్కే.. ఒకే బైకుపై ఏడుగురు ఎలా వెళ్తున్నారో చూస్తే..!

ABN , First Publish Date - 2023-10-07T15:36:34+05:30 IST

అసలే కోతి.. ఆపై కల్లు తాగింది.. అన్న సామెత చందంగా తయారైంది ప్రస్తుతం చాలా మంది యువత నిర్వాకం. కొందరు యువకులు తింగరిచేష్టలు చేస్తూ చివరికి తాము ఇబ్బంది పడడమే కాకుండా పక్కవారికీ ఇబ్బంది కలిగిస్తుంటారు. దీనికితోడు ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో..

Viral Video: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి..? పక్కోళ్ల ప్రాణాలకు కూడా రిస్కే.. ఒకే బైకుపై ఏడుగురు ఎలా వెళ్తున్నారో చూస్తే..!

అసలే కోతి.. ఆపై కల్లు తాగింది.. అన్న సామెత చందంగా తయారైంది ప్రస్తుతం చాలా మంది యువత నిర్వాకం. కొందరు యువకులు తింగరిచేష్టలు చేస్తూ చివరికి తాము ఇబ్బంది పడడమే కాకుండా పక్కవారికీ ఇబ్బంది కలిగిస్తుంటారు. దీనికితోడు ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో రీల్స్ వీడియోల పేరుతో మరింత రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే బైకుపై ఏడుగురు కుర్రాళ్లు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. సాధారణంగా ఒక బైకు ఇద్దరు లేదా కొన్నిసార్లు ముగ్గురు ప్రయాణించడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు నలుగురు ప్రయాణించడం కూడా చూస్తుంటాం. అయితే తాగాజా వైరల్ అవుతున్న వీడియోలో.. ఒకే బైకుపై ఏకంగా (Seven youths riding on bike) ఏడుగురు యువకులు ప్రయాణించడం చూసి అంతా షాక్ అవుతున్నారు. పాత స్ల్పెండర్ బైకుపై నలుగురు యువకులు కూర్చున్నారు. అలాగే బైక్‌కు అటూ, ఇటూ ఇద్దరు వారి వెనుక చివర్లో ఓ యువకుడు వేలాడుతూ కూర్చున్నాడు.

Viral news: సింహం వీడియో చూసి పరుగుపరుగున వెళ్లిన పోలీసులు.. చివరకు అతను ఇలా చేస్తాడని ఊహించలేదు..

సదరు యువకులంతా ఏమాత్రం భయం లేకుండా అలాగే రద్దీ రోడ్డు పైకి వచ్చేశారు. వీరిని చూసి మిగతా వాహనాదరులంతా అవాక్కయ్యారు. కొందరు వాహనదారులు వీరిని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పవర్ ఆఫ్ స్ప్లెండర్’’.. అని కొందరు, ‘‘పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే.. ఎగిరి పక్కన పడతారు జాగ్రత్త’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు చేయడం చాలా ప్రమాదకరం’’.. ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Crime news: చిన్న కూతురుతో కలిసి ఇంట్లో ఉన్న తండ్రి.. కాసేపటికి పెద్ద కూతురు లోపలికి వెళ్లి చూడగా..

Updated Date - 2023-10-07T15:36:34+05:30 IST