Shocking Case: అప్పుడే పుట్టిన బాబు.. చనిపోయాడని సర్టిఫికెట్ కూడా ఇచ్చిన డాక్టర్లు.. అంత్యక్రియలు చేస్తుండగా షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-10-08T15:52:03+05:30 IST

ఆస్పత్రుల్లో అప్పడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చికిత్స కోసం వెళ్లిన వారు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడం, అలాగే ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో క్షేమంగా తిరిగిరావడం జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు...

Shocking Case: అప్పుడే పుట్టిన బాబు.. చనిపోయాడని సర్టిఫికెట్ కూడా ఇచ్చిన డాక్టర్లు.. అంత్యక్రియలు చేస్తుండగా షాకింగ్ ట్విస్ట్..!
ప్రతీకాత్మక చిత్రం

ఆస్పత్రుల్లో అప్పడప్పుడూ ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చికిత్స కోసం వెళ్లిన వారు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడం, అలాగే ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో క్షేమంగా తిరిగిరావడం జరుగుతుంటుంది. మరికొన్నిసార్లు వైద్యుల నిర్లక్ష్యం వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడడం చూస్తూనే ఉంటాం. తాజాగా, అస్సాంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బాబు చనిపోయాడని ధ్రువీకరించిన వైద్యులు.. చివరకు డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయితే తీరా అంత్యక్రియలు చేస్తుండగా షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అస్సాం (Assam) సిల్చార్‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన రతన్ దాస్ అనే వ్యక్తి.. కడుపుతో ఉన్న తన (pregnant woman) భార్యకు పురిటినొప్పులు రావడంతో మంగళవారం సాయంత్రం సిల్చార్‌లోని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. పరీక్షించిన వైద్యులు మహిళ కడుపులో సమస్య ఉందని.. తల్లి లేదా బిడ్డలో ఎవరో ఒకరిని మాత్రమే రక్షించగలమని చెప్పారు. భర్త అనుమతితో వైద్యులు చివరకు ఆమెకు బుధవారం ఉదయం ఆపరేషన్ (operation) చేశారు. అయితే బిడ్డ చనిపోయిందని చెబుతూ డెత్ సర్టిఫికెట్‌తో పాటూ చలనం లేకుండా పడి ఉన్న (baby dead body) బాబును అందజేశారు. దీంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు చేసేదేమీలేక లేక.. చివరకు బాబుకు అంత్యక్రియలు చేసేందుకు తీసుకెళ్లారు.

Crime: 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. తప్పించుకునేందుకు భార్యనూ చంపేందుకు ప్లాన్.. 10 నెలల తర్వాత ఎలా దొరికిపోయాడంటే..!

అయితే శ్మశానవాటికలో బ్యాగ్ తెరిచి చూడగా... ఆశ్చర్యకరంగా బిడ్డ ఏడుస్తూ ఉంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చనిపోయాడనుకున్న బాబు బతికేసరికి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే పసికందును మరో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో చికిత్స అందించారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యంపై చిన్నారి తల్లిదండ్రులతో పాటూ స్థానికులు.. ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. చనిపోయాడని చెప్పి ఎనిమిది గంటల పాటు బాబును బ్యాగులో ఉంచారని, కనీస అవగాహన లేకుండా అలా ఎలా ప్రకటిస్తారంటూ మండిపడ్డారు. అయితే ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. తాము చాలా సార్లు పరిశీలించామని, పిల్లాడిలో చలనం కనిపించకపోతేనే చనిపోయినట్లు చెప్పామని తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Shocking Twist: నా ప్రేయసి కోపంగా ఉంది.. ఏం చేయాలంటూ జ్యోతిష్కుడిని కలిసిన ఇద్దరు కుర్రాళ్లు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

Updated Date - 2023-10-08T15:52:03+05:30 IST