Crime: 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. తప్పించుకునేందుకు భార్యనూ చంపేందుకు ప్లాన్.. 10 నెలల తర్వాత ఎలా దొరికిపోయాడంటే..!

ABN , First Publish Date - 2023-10-07T21:43:09+05:30 IST

కూలి పనులు చేసుకునే ఓ వ్యక్తి ఉన్నట్టుండి ఉన్మాదిగా మారిపోయాడు. ఒంటరిగా ఉన్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చివరకు 400 కిలోమీటర్లు నడిచి సొంతూరుకు వెళ్లిపోయాడు. అయితే..

Crime: 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. తప్పించుకునేందుకు భార్యనూ చంపేందుకు ప్లాన్.. 10 నెలల తర్వాత ఎలా దొరికిపోయాడంటే..!

కూలి పనులు చేసుకునే ఓ వ్యక్తి ఉన్నట్టుండి ఉన్మాదిగా మారిపోయాడు. ఒంటరిగా ఉన్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చివరకు 400 కిలోమీటర్లు నడిచి సొంతూరుకు వెళ్లిపోయాడు. అయితే 10 నెలల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని (Haryana) గురుగ్రామ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) దమోహ్ జిల్లా బర్బన్ గ్రామానికి చెందిన గోవింద్ అలియాస్ డేర్ అనే వ్యక్తి.. కొన్ని నెలలుగా గురుగ్రామ్‌లోని మురికివాడల్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఇతడికి ఇంటి సమీపంలో ఉంటున్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. గోవింద్ తరచూ వారికి ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతను బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో 2023 జనవరి 12న ఇంట్లో ఒంటరిగా (man misbehaves with child) ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చివరకు అతను అక్కడి నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని బర్బన్ గ్రామానికి చేరుకున్నాడు.

Shocking: నడిరోడ్డుపై ఓ మహిళ దారుణ హత్య.. ఆమె పక్కింటి యువతి సడన్‌గా అదృశ్యం.. అసలు కథేంటంటే..!

తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా సొంతూళ్లో కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అప్పటి నుంచి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో, 2020లో ఫరీదాబాద్‌లో నివాసం ఉన్న గోవింద్ తన భార్యను చంపేయాలనే ఉద్దేశంతో రెండో అంతస్థు నుంచి కిందకు తోసేశాడు. దీంతో అప్పట్లో కేసు నమోదైంది. అలాగే అదే ఏడాది మరో వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ కేసుల ఆధారంగా పోలీసులు అతడిపై దృష్టి సారించారు. ఎట్టకేలకు గురువారం అతన్ని బర్బన్ గ్రామానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే 2022లో బెయిల్‌పై బయటకు వచ్చాడు. తర్వాత వాయిదాలకు హాజరుకాకుండా తిరుగుతున్నాడు. గోవింద్‌పై గతంలో పోలీసులు రూ.5వేల రివార్డు కూడా ప్రకటించారు.

Indian Railway: రైల్లో సీట్లోంచి సడన్‌గా లేచిన 19 ఏళ్ల కుర్రాడు.. ఎదురుగా కూర్చున్న దంపతులనే చూస్తూ.. అందరూ చూస్తుండగానే..!

Updated Date - 2023-10-07T21:43:09+05:30 IST