Viral Video: ఇది మరీ టూమచ్ భయ్యా.. ఒకే బైకుపై ఏకంగా సంసారాన్ని ఎలా సర్దేశాడో చూస్తే.. నోరెళ్లబెట్టడం ఖాయం..

ABN , First Publish Date - 2023-10-10T17:53:10+05:30 IST

వాహనాలపై చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తూ వారు ప్రమాదంలో పడడమే కాకుండా పక్క వారినీ ఇబ్బంది పెట్టడం ఇటీవల సర్వసాధారణమైంది. చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు మరింత రెచ్చిపోయి ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. ఒకే బైకుపై...

Viral Video: ఇది మరీ టూమచ్ భయ్యా.. ఒకే బైకుపై ఏకంగా సంసారాన్ని ఎలా సర్దేశాడో చూస్తే.. నోరెళ్లబెట్టడం ఖాయం..

వాహనాలపై చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తూ వారు ప్రమాదంలో పడడమే కాకుండా పక్క వారినీ ఇబ్బంది పెట్టడం ఇటీవల సర్వసాధారణమైంది. చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు మరింత రెచ్చిపోయి ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. ఒకే బైకుపై ముగ్గురు, నలుగురు, ఐదుగురు.. ఇలా పరిమితి మించి ప్రయాణిస్తూ కెమెరాకు చిక్కడం తరచూ జరుగుతూనే ఉంది. తాజాగా, ఓ వ్యక్తి బైకుపై ఏకంగా సంసారాన్నే సర్దేయడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి బైకులో రోడ్డు పైకి వచ్చాడు. ఇందులో విశేషం ఏముందీ అని అనుకుంటున్నారా.. వచ్చింది ఇద్దరో ముగ్గురో కాదు.. ఏకంగా ఏడుమంది. దీనికితోడు తన సంసారన్ని మొత్తం బైకుపై వేసుకుని రావడంతో అంతా అవాక్కయ్యారు. బైకు నడుపుతున్న వ్యక్తి వెనుక అతడి భార్య ఉండగా.. ఆమె వెనుకే ఓ పిల్లాడు నిలబడి ఉన్నాడు. ఆ పిల్లాడి వెనుక మరో ఇద్దరు పిల్లలు, అలాగే ముందు (Seven people travel on one bike) వైపు ఇద్దరు పిల్లలు కూర్చున్నారు.

Viral Video: వామ్మో! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.. లైవ్‌లో బైకుపై ఛేజ్ చేసి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు..

అలాగే బైకు చుట్టూ దుస్తులు తదితరాలకు సంబధించిన బ్యాగులను కట్టేశాడు. వీటికి తోడు రెండు కుక్కలను, కోడిని కూడా మోసుకెళ్తున్నారు. చివరగా వెనుక ఓ పెద్ద కర్రను కట్టాడు. ఆటోలో తీసుకెళ్లాల్సిన బరువులను బైకుపై తీసుకెళ్లడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రోడ్డుపై వెళ్తున్న వారంతా వీడియోలు తీశారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అది బైక్ అనుకున్నావా.. లేక ఆటో అనుకున్నావా’’.. అని కొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయొద్దు’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: నదిలో స్నానం చేసిన మహిళ వీడియో చూసి ఉలిక్కిపడిన పోలీసులు.. ఇంతకీ ఆమె చేసిన నిర్వాకమేంటో తెలిస్తే..

Updated Date - 2023-10-10T17:53:10+05:30 IST