Viral Video: వామ్మో! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.. లైవ్‌లో బైకుపై ఛేజ్ చేసి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు..

ABN , First Publish Date - 2023-10-10T16:13:17+05:30 IST

ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య నాలుగు రోజులుగా భీకర యుద్ధం జరుగుతోంది. హమాస్ మిలిటెంట్లు ఊహించని విధంగా ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడి చేశారు. దీంతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్ హమాస్ దాడులను తిప్పి కొట్టే పనిలో పడింది. ఈ క్రమంలో హమాస్ స్థావరాలపై వైమానిక దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో...

Viral Video: వామ్మో! వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.. లైవ్‌లో బైకుపై ఛేజ్ చేసి మరీ ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు..

ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య నాలుగు రోజులుగా భీకర యుద్ధం జరుగుతోంది. హమాస్ మిలిటెంట్లు ఊహించని విధంగా ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడి చేశారు. దీంతో ఉలిక్కిపడిన ఇజ్రాయెల్ హమాస్ దాడులను తిప్పి కొట్టే పనిలో పడింది. ఈ క్రమంలో హమాస్ స్థావరాలపై వైమానిక దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో పలువురు మిలిటెంట్లు హతమవడంతో పాటూ పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టమవుతున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇజ్రాయెల్ బోర్డర్ పోలీసుల వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇజ్రాయెల్‌ సరిహద్దులోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లను కారులో వెంబడించి మరీ మట్టుబెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఇజ్రాయెల్ (Israel) సరిహద్దులోకి హమాస్ మిలిటెంట్లు (hamas militants) కారులో చొరబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ బోర్డర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే వారిని బైకులు, కార్లలో వెంబడించారు. ఇజ్రాయెల్ పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో హమాస్ మిలింటెంట్లు కారులో అత్యంత వేగంగా వెళ్లిపోయారు. అయితే ఇజ్రాయెల్ పోలీసులు (Israeli police chasing the terrorists) బైకుపై అంతే వేగంగా వారిని వెంబడించాడు. వెళ్తూ వెళ్తూనే ఒంటి చేత్తో కారుపై తుపాకీతో కాల్పులు (Gun firing) జరిపాడు. దీంతో కారులోని మిలిటెంట్లు తీవ్రంగా గాయపడ్డారు.

Viral Video: నదిలో స్నానం చేసిన మహిళ వీడియో చూసి ఉలిక్కిపడిన పోలీసులు.. ఇంతకీ ఆమె చేసిన నిర్వాకమేంటో తెలిస్తే..

చివరకు వారు కారును రోడ్డు పక్కగా ఆపాల్సి వచ్చింది. ఇంతలో మరికొంతమంది ఇజ్రాయెల్ పోలీసులు కారులో అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి హమాస్ మిలింటెంట్లు ఉన్న కారుపై ఏకదాటిగా కాల్పులు జరపడంతో లోపల ఉన్న వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పోలీసుల ఎంతో సాహసం చేశారు’’.. అని కొందరు, ‘‘ప్రాణాలకు తెగించి పోరాడారు’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Indian Railway: రైల్లో సీట్లోంచి సడన్‌గా లేచిన 19 ఏళ్ల కుర్రాడు.. ఎదురుగా కూర్చున్న దంపతులనే చూస్తూ.. అందరూ చూస్తుండగానే..!

Updated Date - 2023-10-10T16:13:17+05:30 IST