Crime news: ఇంటి దగ్గర దిగబెట్టే క్రమంలో బావతో కలిసి మందు తాగిన మరదలు.. అయితే కాసేపటికి మరో నలుగురు రావడంతో..

ABN , First Publish Date - 2023-10-10T22:01:26+05:30 IST

ఏ పుట్టలో ఏ పాము ఉందే అన్న చందంగా.. ఎవరి మనసులో ఏముందో ముందు ఎవరికీ తెలీదు. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు ఎవరి ఎలాంటి వారో తెలుస్తుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. పైకి మంచి వారిలా కనిపించే చాలా మంది..

Crime news: ఇంటి దగ్గర దిగబెట్టే క్రమంలో బావతో కలిసి మందు తాగిన మరదలు.. అయితే కాసేపటికి మరో నలుగురు రావడంతో..
ప్రతీకాత్మక చిత్రం

ఏ పుట్టలో ఏ పాము ఉందే అన్న చందంగా.. ఎవరి మనసులో ఏముందో ముందు ఎవరికీ తెలీదు. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు ఎవరి ఎలాంటి వారో తెలుస్తుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. పైకి మంచి వారిలా కనిపించే చాలా మంది మహిళల విషయంలో మాత్రం రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఇంటి దగ్గర దిగబెట్టే క్రమంలో ఓ మహిళ తన బావ బైక్ ఎక్కింది. మార్గమధ్యలో బలవంతం చేయడంతో మందు కూడా తీసుకుంది. తర్వాత మరో నలుగురు రావడంతో చివరకు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఇటావాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బస్రేహర్ ప్రాంత పరిధికి చెందిన 32ఏళ్ల మహిళ (woman) .. భర్త, అత్తమామలతో కలిసి ఉంటోంది. ఇదిలావుండగా ఇటీవల ఓ రోజు ఆమె తన పుట్టింటికి వెళ్లేందుకు అత్తవారి ఇంటి నుంచి బయలుదేరింది. కాలినడకన వెళ్తుండగా.. మార్గ మధ్యలో ఆమెకు తన బావ ఎదురుబపడ్డాడు. ఇంటి వద్ద దిగబెడతానని చెప్పడంతో అతడి బైకు ఎక్కింది. అయితే కొంచెం దూరం వెళ్లగానే బండి ఆపి మందు బాటిళ్లు బయటికి తీశాడు. తాను తాగడమే కాకుండా తన మరదలితో కూడా తాగించాడు. ఆమెకు మత్తు ఎక్కగానే బైకు ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.

Viral Video: బైకుపై వెళ్తూ కారునే ఓవర్‌టేక్ చేసిన యువకుడు.. కాస్త ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా షాకింగ్ సీన్.. చివరకు..

crime.jpg

అక్కడ అప్పటికే అతడి స్నేహితులు నలుగురు ఉన్నారు. అంతా కలిసి మళ్లీ మద్యం సేవించడంతో చివరకు ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో అంతా (Indecent behavior on woman) కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన విషయం తెలుసుకుని.. నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటూ స్థానికులూ డిమాండ్ చేస్తున్నారు.

Viral Video: నదిలో స్నానం చేసిన మహిళ వీడియో చూసి ఉలిక్కిపడిన పోలీసులు.. ఇంతకీ ఆమె చేసిన నిర్వాకమేంటో తెలిస్తే..

Updated Date - 2023-10-10T22:01:26+05:30 IST