Viral Video: మా నాన్న అన్నీ చెప్తారు.. మా అమ్మకు పిరియడ్స్ వస్తే ప్యాడ్స్‌ మేమే తెస్తాం.. వైరల్ అవుతున్న కుర్రాడి వీడియో..!

ABN , First Publish Date - 2023-04-07T13:20:12+05:30 IST

ఈ కాలపు పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తుల, అంతస్తులు ఇవ్వడం కంటే కూడా విలువలు, సమాజం పట్ల గౌరవం వంటి విషయాలను చిన్నప్పటి నుంచి చెప్పడం ఎంతో ముఖ్యం.

Viral Video: మా నాన్న అన్నీ చెప్తారు.. మా అమ్మకు పిరియడ్స్ వస్తే ప్యాడ్స్‌ మేమే తెస్తాం.. వైరల్ అవుతున్న కుర్రాడి వీడియో..!

ఇంటర్నెట్ డెస్క్: ఈ కాలపు పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తుల, అంతస్తులు ఇవ్వడం కంటే కూడా విలువలు, సమాజం పట్ల గౌరవం వంటి విషయాలను చిన్నప్పటి నుంచి చెప్పడం ఎంతో ముఖ్యం. అందులోనూ అబ్బాయిలకు ముఖ్యంగా మహిళలతో ఎలా మెలగాలి అనేది నేర్పాలి. ఈ జనరేషన్ పిల్లలో ప్రస్తుతం ప్రధానంగా కొరవడిందే ఇది. అందుకే ఇప్పటి పిల్లలలో పెద్దలు, మహిళల పట్ల గౌరవం అనేది బొద్దిగా కనిపించడం లేదు. రోజురోజుకు మహిళలపై హింసలు పెరిగిపోతున్నాయి. ఇక వృద్ధాప్యంలో తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్నవారు కూడా కొకొల్లలు. అదే పిల్లలకు చిన్నప్పటి నుంచి మహిళల విషయంలో అవగాహన కల్పిస్తే ఆటోమెటిక్‌గా వారిపట్ల పెద్దయాక పిల్లలకు గౌరవం పెరుగుతుంది. మహిళల గురించి ప్రతి విషయం వారికి అర్థమయ్యేలా క్షుణ్ణంగా వివరించాలి. అప్పుడే వారు సమాజానికి ఆదర్శవంతులుగా తయారవుతారు.

ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకుబోయే ఈ తండ్రి తన ఇద్దరు అబ్బాయిల విషయంలో అదే చేశాడు. వారికి చిన్నప్పటి నుంచే మహిళల గురించి, వారిని ఎలా గౌరవించాలి, వారికి ఉండే పర్సనల్ సమస్యలు ఇలా ప్రతి విషయాన్ని వారికి కులంకషంగా చెబుతూ వచ్చాడు. దాంతో ఆ పిల్లలు ఇప్పుడు తమ తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే తల్లిని మహారాణిలా ట్రీట్ చేస్తున్నారు. బయట మహిళలతోనూ వారు అదే సత్ప్రవర్తనతో మెలుగుతున్నారు. తమ తల్లిని వారు ఎలా చూసుకుంటారో ఓ వీడియో ద్వారా స్వయంగా ఆ కుమారుడే వివరించాడు. తల్లికి ఏదైనా జబ్బు చేసినా.. చివరికి ఆమె రుతుక్రమంలో (Menstrual cycle) ఉన్నప్పడు కూడా అన్ని విధాల వారే దగ్గరుండి చూసుకుంటారట. ఎంతలా అంటే.. ఆమెకు ప్యాడ్స్‌ కూడా వారే తెచ్చి ఇస్తారట. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రీల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Viral News: అబ్బా.. పెద్ద చిక్కే వచ్చి పడిందిగా.. వీటిల్లో జీలకర్ర ఏదో, సోంపు ఏదో చెప్పమంటూ ప్రియుడికి ఫొటోలు తీసి పెడితే..!


అనీష్ భగత్ అనే యువకుడు ఇలా ఇన్‌స్టా రీల్ వీడియోను షేర్ చేస్తూ.. తన తల్లిని తాను తన సోదరుడు, తన తండ్రి ఎలా ఆమె నెలసరిలో (Periods) ఉన్నప్పుడు మహారాణిలా చూసుకుంటారో వివరించాడు. దీనికంతటికీ కారణం చిన్నప్పుడు తండ్రి.. సహజసిద్ధంగా ప్రకృతి ధర్మం ప్రకారం మహిళల్లో వచ్చే రుతుక్రమంపై అవగాహన కల్పించడమేనని అనీష్ తెలిపాడు. "మా నాన్న పదమూడేళ్ళ వయసులో మా తమ్ముడికి మరియు నాకు పీరియడ్స్ అనే కాన్సెప్ట్‌ని పరిచయం చేసారు. అతను ఎలా ఉన్నా తల్లిని ఆ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు." అని చెప్పుకొచ్చాడు.

Viral News: 10 మందిని పెళ్లి చేసుకుంటా.. 10 మంది పిల్లలకు తండ్రిని కావడమే నా డ్రీమ్.. అంటూ పదే పదే చెప్పి.. చివరకు ఊహించని షాకిచ్చాడు..!

ఇక వారికి 'భగత్ మెన్' పేరిట ఓ ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందట. తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ గ్రూపు ద్వారా వారు కమ్యూనికేట్ చేసుకుని ఆమెకు సాయంగా ఉంటారట. ఇలా వారు ముగ్గురు తమ వంతులవారిగా ప్రతినెల తల్లికి ఆ సమయంలో కావాల్సినవన్నీ సమకూరుస్తుంటామని భగత్ చెప్పాడు. దీనిలో భాగంగా ఇటీవల తనవంతు రావడంతో టీ తో పాటు ట్రేలో ప్యాడ్స్ ప్యాకెట్‌ను పెట్టి తల్లికి ఇచ్చానని అన్నాడు. ఆ సందర్భంలో తీసిన వీడియోను షేర్ చేసిన భగత్.. అందులో తన తల్లి రియాక్షన్ ఏంటో మీరే చూడండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా గత ఆరేళ్లుగా తల్లికి ఆ ఇద్దరు కుమారులు బహిష్టు సమయంలో సాయం చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు అనీష్.. "నెలసరి సమయంలో ఆమె రాణి లా ట్రీట్ చేయబడుతుంది" అనే క్యాప్షన్‌తో షేర్ చేయడం విశేషం.

Instant Karma: చక్కగా పడుకున్న ఆవులతో ఓ కుర్రాడి పిచ్చి చేష్టలు.. మరుక్షణమే దిమ్మతిరిగిపోయేలా రిజల్ట్.. వైరల్ వీడియో!

ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే 20.66లక్షల లైక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'హ్యాట్సాఫ్.. కొడుకులను ఎలా పెంచాలో ఈ తండ్రిని చూసి తెలుసుకోవాలి' అని చెబుతున్నారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. 'మీ నాన్న నిజంగా గ్రేట్. ఆయనకు నా తరఫున థ్యాంక్స్ చెప్పు. భార్యపై ఆయనకు చాలా ప్రేమ ఉంది. అందుకే మిమ్మల్ని ఇలా పెంచాడు. మీరు ప్రేమించే వారిని కూడా ఇలాగే చూసుకోండి' అని అన్నాడు. మరో యూజర్.. 'అద్భుతం! అత్యుత్తమ పెంపకానికి ఇది సరైన ఉదాహరణ. పీరియడ్ అనేది ఒక సహజమైన విషయం. కొంతమంది అబ్బాయిలు అంతకుమించి ముందుకు వెళ్లడానికి చొరవ తీసుకోవడం చూసి నేను సంతోషిస్తున్నాను. దానికి నేను చాలా కృతజ్ఞుడను. ఇది మంచి ప్రారంభం' అని చెప్పుకొచ్చాడు.

Destiny: విధిరాత అంటే ఇదేనేమో.. 14 ఏళ్ల తర్వాత జైల్లోంచి బయటకు.. కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన 15 రోజులకే ఊహకందని రీతిలో మరణించాడు..!

Updated Date - 2023-04-07T13:20:12+05:30 IST