Destiny: విధిరాత అంటే ఇదేనేమో.. 14 ఏళ్ల తర్వాత జైల్లోంచి బయటకు.. కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన 15 రోజులకే ఊహకందని రీతిలో మరణించాడు..!

ABN , First Publish Date - 2023-04-06T10:17:14+05:30 IST

విధిరాత నుంచి తప్పించుకోలేరు అనే దానికి తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఔరయ్యాలో జరిగిన ఈ సంఘటనే బెస్ట్ ఉదాహరణ.

Destiny: విధిరాత అంటే ఇదేనేమో.. 14 ఏళ్ల తర్వాత జైల్లోంచి బయటకు.. కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన 15 రోజులకే ఊహకందని రీతిలో మరణించాడు..!

ఇంటర్నెట్ డెస్క్: విధిరాత నుంచి తప్పించుకోలేరు అనే దానికి తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఔరయ్యాలో జరిగిన ఈ సంఘటనే బెస్ట్ ఉదాహరణ. 14 ఏళ్ల తర్వాత జైల్లోంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన 15 రోజులకే ఊహకందని రీతిలో చనిపోయాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందంటే.. యూపీలోని ఔరయ్య జిల్లా బిధున కోత్వాలి పరిధిలోని రుర్కులా గ్రామానికి చెందిన జవహార్ లాల్ దూబే 2009లో తన భార్యను కాల్చిచంపి జైలుకు వెళ్లాడు. 14 ఏళ్లు జైల్లోనే ఉన్నాడు. గతేడాది దీపావళికి జైలు నుంచి విడుదలైన జవహార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల కింద కొత్త సీఎన్‌జీ ఆటో (CNG Auto) కొన్నాడు. మంగళవారం ఉదయం సోదరుడు సంజీవ్ అతడి కూతుళ్లతో గొడవపడ్డ జవహార్.. ఇంట్లోంచి తన సామాన్లు సర్దుకుని ఆటోలో బయటకు వచ్చేశాడు.

అయితే, కొంతదూరం వచ్చాక జవహార్ ఆటో ఊహించని విధంగా ప్రమాదం బారిన పడింది. బిధున అచ్చల్దా మార్గ్ (Bidhuna Achhalda Marg) సమీపంలోని అశోక్ పూరి ఫార్మ్ వద్దకు రాగానే ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో జవహార్ ఆటో నుంచి బయటకు దూకేశాడు. కానీ, అప్పటికే అతినికి మంటలు అంటుకున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న జవహార్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడిని పరిశీలించిన వైద్యులు మార్గం మధ్యలోనే చనిపోయినట్లు వెల్లడించారు. కాగా, ఆటోలో షార్ట్ సర్క్యూట్ కావడం, అప్పటికే సీఎన్‌జీ లీక్ అవుతుండడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. 14 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన జవహార్.. కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన 15 రోజులకే ఇలా ఊహకందని విధంగా చనిపోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.

Shocking Incident: ఇలాంటి చావు పగోడికి కూడా రాకూడదు తల్లీ.. 20 రోజుల క్రితమే తల్లి చనిపోయిందని ఆ కొడుక్కు తెలియక..!


Updated Date - 2023-04-06T10:17:14+05:30 IST