Viral Video: ఈసారి ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియో నిజంగానే సమ్‌థింగ్ స్పెషల్ అని చెప్పాలి.. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో కదా..!

ABN , First Publish Date - 2023-03-30T13:41:52+05:30 IST

సోషల్ మీడియాలో (Social Media)ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే విషయాలు, వాటి తాలూకు ఫొటోలు, వీడియోలు సమ్‌థింగ్ స్పెషల్‌గా (Something Sepecial) ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే.

Viral Video: ఈసారి ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియో నిజంగానే సమ్‌థింగ్ స్పెషల్ అని చెప్పాలి.. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో కదా..!

Viral Video: సోషల్ మీడియాలో (Social Media)ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే విషయాలు, వాటి తాలూకు ఫొటోలు, వీడియోలు సమ్‌థింగ్ స్పెషల్‌గా (Something Sepecial) ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే కోవలో ఆయన తాజాగా మరో ప్రత్యేకమైన వీడియోను ట్విటర్‌లో (Twitter) పోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral Video) అవుతోంది. బుధవారం మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 1.3మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక ఎప్పటిలాగే ఈ వీడియోకు కూడా ఆయన శైలిలోనే "మనసుంటే మార్గం ఉంటది. హ్యాండ్ మేడ్ అండ్ ఫ్యాన్ మేడ్ ఐస్ క్రీం" అనే క్రియేటివ్ క్యాప్షన్ ఇచ్చారు. ఇక వీడియోలో ఓ మహిళ కూసింత వెరైటీగా ఐస్‌క్రీం తయారు చేయడం మనం చూడొచ్చు. అది కూడా మనం ఇళ్లలో చల్లదనం కోసం వినియోగించే ఫ్యాన్‌తో. ఫ్యాన్‌కు (Fan) ఓ తాడును కట్టి, దాని రెండో చివర ఐస్‌క్రీం ఇంగ్రియంట్స్ ఉన్న ఓ క్యాన్‌ను వేలాడదీసింది. అలా వేలాడదీసిన క్యాన్ కింద ఒక పెద్ద బౌల్‌లో ఐస్ ముక్కలను ఉంచింది. ఆ తర్వాత ఫ్యాన్ స్వీచాన్ చేసింది. కొద్దిసేపటి తర్వాత స్వీచాఫ్ చేసి, క్యాన్‌ను బౌల్ నుంచి బయటకు తీసింది. క్యాన్ మూత తీసి చూస్తే చిక్కటి ఐస్‌క్రీం రెడీ అయింది. అంతే.. ఆ తర్వాత సర్వీంగ్ కప్‌లో ఆ ఐస్‌క్రీంను తీసి తన కుటుంబ సభ్యులకు ఇవ్వడం మనం వీడియోలో చూడొచ్చు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో' అని కామెంట్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 'నిజం చెబుతున్నా.. పానీ పూరి చాలా టేస్టీ'.. వైరల్ అవుతున్న కొరియన్ బాయ్ వీడియో..!

Updated Date - 2023-03-30T13:41:52+05:30 IST