Viral Video: 'నిజం చెబుతున్నా.. పానీ పూరి చాలా టేస్టీ'.. వైరల్ అవుతున్న కొరియన్ బాయ్ వీడియో..!

ABN , First Publish Date - 2023-03-29T12:53:57+05:30 IST

'పానీ పూరి'.. ఈ పేరు వింటే చాలు చాలా మందికి ఇట్టే నోటి వెంట నీళ్లు వచ్చేస్తాయి.

Viral Video: 'నిజం చెబుతున్నా.. పానీ పూరి చాలా టేస్టీ'.. వైరల్ అవుతున్న కొరియన్ బాయ్ వీడియో..!

Viral Video: 'పానీ పూరి'.. ఈ పేరు వింటే చాలు చాలా మందికి ఇట్టే నోటి వెంట నీళ్లు వచ్చేస్తాయి. మన దగ్గర ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాకుండా దేశవ్యాప్తంగా రోడ్‌సైడ్లలో కామన్‌గా దొరికే చిరుతిళ్లలో పానీ పూరి (Pani Puri) ఒకటి. జిహ్వాకు ఎదైనా స్పైసీ రుచి చూపించాలంటే వెంటనే గుర్తొచ్చేది కూడా ఇదే. ఇక ఈ తినుబండారాన్ని క్రమం తప్పకుండా టేస్ట్ చేసేవారు కూడా చాలా మందే ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామనేగా మీ అనుమానం. అక్కడి వస్తున్నాం. ప్రస్తుతం పానీ పూరి తాలూకు వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ కొరియన్ యూట్యూబర్ మొదటిసారి పానీ పూరి రుచి చూసిన సందర్భానికి సంబంధించిందా వీడియో.

భారతీయ వీధుల్లో దొరికే ఈ టేస్టీ స్నాక్స్‌ను రుచి చూసిన ఆ కొరియన్ యువకుడు చాలా అద్భుతమైన టేస్ట్ అంటూ చెప్పడం మనం వీడియోలో చూడొచ్చు. మొదట ఓ స్వీట్ పానీ పూరి తిన్న అతడు.. ఆ తర్వాత స్పైసీ ఫ్లేవర్ పీస్‌ను టేస్ట్ చేశాడు. తాను ఇప్పటివరకు తిన్న చిరుతిళ్లలో పానీ పూరి 'ది బెస్ట్' అని అతడు చెప్పడం వీడియోలో ఉంది. 'కొరియన్ లడ్కా' పేరిట సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ (Viral Video) అవుతోంది. ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోకు ఇప్పటివరకు 16వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కొత్త పెళ్లికూతురి డ్యాన్స్ మూవ్స్‌కు నెటిజన్లు ఫిదా.. సింప్లీ సూపర్బ్ అంతే..!

Updated Date - 2023-03-29T15:56:19+05:30 IST