Viral Video: కొత్త పెళ్లికూతురి డ్యాన్స్ మూవ్స్‌కు నెటిజన్లు ఫిదా.. సింప్లీ సూపర్బ్ అంతే..!

ABN , First Publish Date - 2023-03-25T13:29:45+05:30 IST

సామాజిక మాధ్యమాల్లో (Social Media) ప్రతిరోజు ఏదో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంటుంది.

Viral Video: కొత్త పెళ్లికూతురి డ్యాన్స్ మూవ్స్‌కు నెటిజన్లు ఫిదా.. సింప్లీ సూపర్బ్ అంతే..!

Viral Video: సామాజిక మాధ్యమాల్లో (Social Media) ప్రతిరోజు ఏదో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంటుంది. ఇదే కోవలో తాజాగా ఓ కొత్త పెళ్లికూతురి (Newlywed Woman) డ్యాన్స్ తాలూకు వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. కొత్తగా పెళ్లయిన ఓ పంజాబీ యువతి తన సింప్లీ డ్యాన్స్ మూవ్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తోంది. 'దారు బద్నామ్' అనే పంజాబీ పాటపై (Punjabi Song) ఆమె వేసిన చిన్న చిన్నా డ్యాన్స్ మూవ్స్ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఆకట్టుకునే బీట్‌, మంచి లిరిక్స్ కారణంగా ఈ పాట పంజాబీ వివాహలలో ఎక్కువగా వినిపిస్తుందట. ఆ బీట్‌నే కొత్తగా పెళ్లయిన ఆ యువతి తెగ ఎంజాయ్ చేస్తూ సింప్లీ మూవ్స్‌తో మస్త్‌గా డ్యాన్స్‌గా చేయడం మనం వీడియోలో చూడొచ్చు. గురుప్రీత్ కౌర్ అనే ఇన్‌స్టా యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 1.09 లక్షల లైక్స్ వచ్చి పడ్డాయి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ 'వావ్.. సింప్లీ సూపర్బ్' అని కొనియాడుతున్నారు. ఇంకేందుకు ఆలస్యం.. మీరు నెట్టింట వైరల్ అవుతున్న కొత్త పెళ్లి కూతురి డ్యాన్స్‌పై ఓ లుక్కేసేయండి మరి.

ఇది కూడా చదవండి: 'ఐఫోన్ 14' కొనేందుకు 12ఏళ్ల అమ్మాయి.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!

Updated Date - 2023-03-25T13:30:05+05:30 IST