Dubai: 'ఐఫోన్ 14' కొనేందుకు 12ఏళ్ల అమ్మాయి.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!

ABN , First Publish Date - 2023-03-25T11:10:26+05:30 IST

దుబాయిలో ఉండే ఓ 12 ఏళ్ల అమ్మాయికి యాపిల్ ఐఫోన్ అంటే పిచ్చి. ఎలాగైనా ఐఫోన్ కొనుగోలు చేయాలనేది ఆమె కోరిక.

Dubai: 'ఐఫోన్ 14' కొనేందుకు 12ఏళ్ల అమ్మాయి.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!

దుబాయి: దుబాయిలో ఉండే ఓ 12 ఏళ్ల అమ్మాయికి యాపిల్ ఐఫోన్ అంటే పిచ్చి. ఎలాగైనా ఐఫోన్ కొనుగోలు చేయాలనేది ఆమె కోరిక. కానీ, ఇంట్లో తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతా మాత్రమే. వారికి తన కోరిక గురించి చెబితే కచ్చితంగా తీట్లు పడతాయి. అప్పుడే ఆమెకు ఓ మంచి ఐడియా తట్టింది. ఇంకేముంది దాన్ని అమలు చేసింది.. 40 రోజుల వ్యవధిలోనే ఐఫోన్ 14 కొనేసింది. తాజాగా ఆమె ఇంటికి ఫోన్ కూడా డెలివరీ అయింది. తన కలల ఫోన్ అందుకోవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇంతకీ ఆమె రూ.70వేల వరకు ఉండే ఐఫోన్ 14ను కొనుగోలు చేసేందుకు ఏం చేసింది? 40 రోజుల వ్యవధిలోనే అంత డబ్బు ఎలా కూడబెట్టింది? అసలు ఆమెకు వచ్చిన ఐడియా ఏంటి? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాలిక పేరు బియాంక జెమి వారియావా (12). దుబాయిలోని ఓ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. ఆమె తల్లి జెమినా వారియావాది ఫిలిప్పీన్స్. తండ్రి జెమిభాయ్ వారియావాది ఇండియా. వారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. ఇద్దరూ కూడా మంచి చెఫ్స్. అక్కడి ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో పని చేస్తున్నారు. దాంతో చిన్నప్పటి నుంచి బియాంక ఇంట్లో పేరెంట్స్ చేసే వంటకాలను చూసేది. ఇక తల్లి అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ బిస్కెట్లను ఆమె లంచ్ బాక్స్‌లో వేసి పంపించేది. ఇలా ఒకరోజు బియాంక క్లాస్‌మెట్స్ ఆమె లంచ్ బాక్సులోని బిస్కెట్లను తిన్నారు. అంతే.. అప్పటి నుంచి బియాంకను తరుచూ ఆ బిస్కెట్ల గురించే అడిగేవారు.

ఇది కూడా చదవండి: అసలు గల్ఫ్ దేశంలో ఏం జరుగుతుంది..? ప్రవాసులను షాపింగ్స్ చేయకుండా నిరోధించడం ఏంటి..?!

G.jpg

ఇదిలాఉంటే.. బియాంకకు యాపిల్ ఐఫోన్స్ అంటే ఎంతో పిచ్చి. కానీ, అంత కాస్ల్టీ ఫోన్ కొనమంటే తల్లిదండ్రులు కొనడం చాలా కష్టం. పైగా చిన్నపిల్లవి నీకేందుకు అంత విలువైన ఫోన్ అంటూ తిట్టడం ఖాయం. అప్పుడే ఆమెకు ఓ సూపర్బ్ ఐడియా తట్టింది. అది కనుక క్లీక్ అయితే మాత్రం తానే సొంతంగా ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇంతకీ ఆమెకు వచ్చిన ఆ ఐడియా ఎంటో తెలుసా? తన మమ్మీ తయారు చేసే బిస్కెట్లను తానే స్వయంగా ఇంటి దగ్గర తయారు చేసి స్కూల్‌లో అమ్మడం. ఎందుకంటే అవి తన ఫ్రెండ్స్‌తో పాటు పాఠశాలలోని ఇతర చాలా మంది పిల్లలకు కూడా నచ్చాయి. వారు ఎంతో ఇష్టంగా వాటిని తినడం ఆమె గమనించింది. అందుకే ఆ బిస్కెట్లనే పలు ఫ్లేవర్స్‌లో తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడువుగా తన స్నేహితులకు విషయం చెప్పి, ఎవరికైనా కావాలంటే చెప్పండి తెచ్చి ఇస్తానని తెలిపింది. నాలుగు బిస్కెట్లకు 10 దిర్హమ్స్‌గా (రూ.224) ధర నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: ఆ రెండు వీసాలపై యూఎస్ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై వాటితో కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు..!

అయితే, మొదటి రోజు కేవలం ఇద్దరు మాత్రమే ఆర్డర్ చేశారట. అలా వారం రోజు ఒకరిద్దరూ మాత్రమే ఆ బిస్కెట్ల కోసం అడిగేవారట. కానీ, ఆ తర్వాతి వారం నుంచి మాత్రం అనూహ్యంగా ఆర్డర్‌లు పెరిగాయి. దాంతో రోజుకు కనీసం 60 బిస్కెట్ల వరకు విక్రయించింది. అలా ఫిబ్రవరి మొదట్లో బియాంక ఈ బిజినెస్ ప్రారంభించింది. మార్చి రెండో వారంకల్లా ఆమెకు ఐఫోన్ కొనుగోలుకు కావాల్సిన 3వేల దిర్హమ్స్ (సుమారు రూ.68వేలు) సంపాదించింది. అంతే.. వెంటనే ఐఫోన్ 14 కోసం అమెజాన్‌లో ఆర్డర్ చేసేసింది బియాంక. తాజాగా ఆమెకు ఫోన్ కూడా డెలివరీ అయింది. ఇంకేముంది తన కలల ఫోన్ తన చేతిలో ఉండడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇది కూడా చదవండి: భారత ఎంబసీ కీలక ప్రకటన.. మారిన పాస్‌పోర్ట్ సెంటర్‌ పనివేళలు

Updated Date - 2023-03-25T11:42:39+05:30 IST