Dubai: ప్రవాసులు, నివాసితులకు హెచ్చరిక.. అలా చేశారో రూ.11లక్షల వరకు జరిమానా..!

ABN , First Publish Date - 2022-12-22T11:01:40+05:30 IST

దుబాయ్‌లోని (Dubai) ప్రవాసులు, నివాసితులను (Residents) ఉద్దేశించి తాజాగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ (Public Prosecution) హెచ్చరికతో కూడిన ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేసింది.

Dubai: ప్రవాసులు, నివాసితులకు హెచ్చరిక.. అలా చేశారో రూ.11లక్షల వరకు జరిమానా..!

దుబాయ్: దుబాయ్‌లోని (Dubai) ప్రవాసులు, నివాసితులను (Residents) ఉద్దేశించి తాజాగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ (Public Prosecution) హెచ్చరికతో కూడిన ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేసింది. మాదకద్రవ్యాలు (Drugs), సైకోట్రోపిక్ పదార్థాలు (Psychotropic Substances) కొనుగోలు, వినియోగం ఉద్దేశంతో ఎవరైన మనీ ట్రాన్స్‌ఫర్ (Money Transfer) చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వీడియోలో పేర్కొంది. 2021లో తీసుకొచ్చిన చట్టం నం.30లోని ఆర్టికల్ 64/1 ప్రకారం డ్రగ్స్ కొనుగోలు కోసం ఇతరులకు ఆన్‌లైన్ ద్వారా వారి ఖాతాల్లోకి డబ్బు జమా చేస్తే అలాంటి వారు శిక్షార్హులు. దీనికి గాను 50వేల దిర్హమ్స్(రూ.11.27లక్షలు) వరకు జరిమానా, జైలు కూడా ఉంటుందని తెలిపింది. ఇక ఈ సమాచార వీడియో సమాజంలోని సభ్యుల మధ్య చట్టపరమైన సంస్కృతిని పెంపొందించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కొనసాగిస్తుతున్న క్యాంపెయిన్‌ ఫ్రేమ్‌వర్క్‌లో వస్తుందని అధికారులు తెలిపారు. దేశంలోని అన్ని కొత్త, సవరించబడిన చట్టాలను ప్రచురించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యమని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.

Updated Date - 2022-12-22T11:04:39+05:30 IST