Viral News: అబ్బా.. పెద్ద చిక్కే వచ్చి పడిందిగా.. వీటిల్లో జీలకర్ర ఏదో, సోంపు ఏదో చెప్పమంటూ ప్రియుడికి ఫొటోలు తీసి పెడితే..!

ABN , First Publish Date - 2023-04-07T11:24:22+05:30 IST

ఇద్దరు ప్రేమికుల (Lovers) మధ్య జరిగిన ఓ సరదా చాటింగ్ తాలూకు స్క్రీన్‌షాట్ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral News: అబ్బా.. పెద్ద చిక్కే వచ్చి పడిందిగా.. వీటిల్లో జీలకర్ర ఏదో, సోంపు ఏదో చెప్పమంటూ ప్రియుడికి ఫొటోలు తీసి పెడితే..!

ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరు ప్రేమికుల (Lovers) మధ్య జరిగిన ఓ సరదా చాటింగ్ తాలూకు స్క్రీన్‌షాట్ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రియురాలు ఓ డౌట్ అడగడం.. దానికి ప్రియుడు అన్సర్ చేయడం.. ఆ తర్వాత ఆ సరదా చాటింగ్‌ను స్క్రీన్‌షాట్ (Screenshot) తీసి సోషల్ మీడియాలో పెట్టడాడు. అంతే.. క్షణాల వ్యవధిలో అది వైరల్‌గా మారింది. అసలు స్క్రీన్‌షాట్‌లో ఆ లవర్స్ మధ్య జరిగిన చాటింగ్ ఏంటి? ప్రేయసి అడిగిన డౌట్ ఏంటి? దానికి ప్రేమికుడు చెప్పిన సమాధానం ఏమిటి? అనే వివరాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ఆ స్క్రీన్‌షాట్‌లో ఉన్న ప్రేమికుల చాటింగ్ ప్రకారం.. మొదట బాయ్‌ఫ్రెండ్‌కు (Boyfriend) గర్ల్‌ఫ్రెండ్ ఓ ఫొటో పంపించింది. అందులో రెండు ఇంగ్రీయంట్స్ మనం చూడొచ్చు. వాటిల్లో జీలకర్ర ఏదో, సోంపు ఏదో చెప్పమని ఆమె ప్రియుడిని అడిగింది. దాంతో అతడు అందులో మొదట జీలకర్ర ఏదో ఆమెకు చెప్పాడు. దానికి ఆమె పక్కా ఇది జీలకర్రనే కదా అని అడిగింది. అవును.. పక్కా అదేనని రిప్లై ఇచ్చాడు. దాంతో ప్రియురాలు థ్యాంక్స్ చెప్పింది. ఈ సరదా చాటింగ్‌ను ప్రియుడు సుమిత్ స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్‌లో పెట్టాడు. 'సారీ మమ్మా మైనే గలత్ లడ్కీ కే సాత్ ఫస్ గయా' అనే క్యాప్షన్ కూడా జోడించాడు.

Viral News: 10 మందిని పెళ్లి చేసుకుంటా.. 10 మంది పిల్లలకు తండ్రిని కావడమే నా డ్రీమ్.. అంటూ పదే పదే చెప్పి.. చివరకు ఊహించని షాకిచ్చాడు..!


దాంతో ఈ ట్వీట్ (Tweet) క్షణాల వ్యవధిలో వైరల్ అయింది. ఇప్పటివరకు 74.5 వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో చమత్కరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 'బ్రదర్ ఆమె నిన్ను పరీక్షిస్తోంది.. తర్వాత వంట చేయాల్సిందే నీవేగా' అని ఒకరు, 'మీ అమ్మగారి ప్రకారం నీ డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది' అని మరోకరు, 'భాయ్.. వాసనతో కూడా వాటిని గుర్తు పట్టొచ్చుగా' అని ఇంకొకరు కామెంట్ చేశారు. చివరి కామెంట్‌కు సుమిత్ తనదైనశైలిలో రిప్లై ఇచ్చాడు. 'మీరు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. కానీ, ఆమెకు అది కూడా తెలియదు' అని చమత్కరించాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

Instant Karma: చక్కగా పడుకున్న ఆవులతో ఓ కుర్రాడి పిచ్చి చేష్టలు.. మరుక్షణమే దిమ్మతిరిగిపోయేలా రిజల్ట్.. వైరల్ వీడియో!

Updated Date - 2023-04-07T11:24:22+05:30 IST