Friend's Gift: అమెరికా నుంచి ఓ స్నేహితురాలు పంపిన గిఫ్ట్ వల్లే ఏకంగా రూ.4 లక్షలు మటాష్.. ఓ మహిళకు షాకింగ్ అనుభవం..!

ABN , First Publish Date - 2023-04-22T20:58:19+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనకు తెలీకుండా మన ఖాతాలోని నగదును ఖాళీ చేస్తుంటారు. మరికొందరు, ముందుగా పరిచయం చేసుకుని, తర్వాత వివిధ రకాలుగా ఆశ చూపించి.. చివరకు..

Friend's Gift: అమెరికా నుంచి ఓ స్నేహితురాలు పంపిన గిఫ్ట్ వల్లే ఏకంగా రూ.4 లక్షలు మటాష్.. ఓ మహిళకు షాకింగ్ అనుభవం..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనకు తెలీకుండా మన ఖాతాలోని నగదును ఖాళీ చేస్తుంటారు. మరికొందరు, ముందుగా పరిచయం చేసుకుని, తర్వాత వివిధ రకాలుగా ఆశ చూపించి.. చివరకు నిండా ముంచేస్తుంటారు. కొందరు నేరస్థుల తెలివితేటలు.. పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి నేరాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికా నుంచి ఓ స్నేహితురాలు పంపిన గిఫ్ట్ వల్ల ఓ మహిళ ఏకంగా రూ.4 లక్షలు మోసపోయింది. వివరాల్లోకి వెళితే..

ముంబైకి (Mumbai) చెందిన అమూల్య అనే మహిళకు ఇటీవల సోషల్ మీడియాలో అమెరికాకు చెందిన ఓ మహిళ (American woman) పరిచయమైంది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఏర్పడింది. తర్వాత అమెరికా మహిళ అసలు డ్రామా మొదలెట్టింది. ‘‘నా తరపు నుంచి నీకు ఓ గిఫ్ట్ పంపుతున్నా.. అందులో యూఎస్ డాలర్లతో (US dollars) పాటూ మరికొన్ని వస్తువులు ఉన్నాయి’’.. అంటూ అమూల్యను నమ్మించింది. అలాగే పంపుతున్న వస్తువులకు సంబంధించిన లిస్ట్‌ను వాట్సప్‌లో పంపించింది. దీంతో అమూల్య ఎంతో సంతోషించింది. సదరు గిఫ్ట్ బాక్సును ఇండియాకు పంపాలంటే పన్నుల రూపంలో కొంత మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందని చెప్పింది.

Indian Army: నీ నిర్ణయానికి సెల్యూట్ అమ్మా.. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ.. చైనా సైనికుల దాడిలో భర్త వీరమరణం పొందిన మూడేళ్లకే..

ఇలా పలు దపాలుగా వారు చెప్పిన అకౌంట్లకు సుమారు రూ.4లక్షలు పంపించింది. అయినా మళ్లీ ఖర్చుల కింద నగదు పంపమని అడుగుతుండడంతో అమూల్యకు అనుమానం కలిగింది. పదే పదే ఫోన్లు వస్తుండడంతో మోసపోయానని తెలసుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమూల్య నగదు పంపించిన.. ప్రన్షు గుప్తా, హర్జీత్ సింగ్ అనే ఇద్దరు భారతీయుల అకౌంట్ల వివరాలను ట్రాక్ చేస్తున్నారు. ముంబై పరిధిలో ఈ ఏడాది మార్చి వరకు ఇలాంటి కేసులు మొత్తం 17 నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral News: ప్రియుడితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ అసలు నిజం బయటపెట్టిన ప్రేయసి.. అవాక్కవుతున్న నెటిజన్లు..!

Updated Date - 2023-04-22T20:58:19+05:30 IST