Viral News: ప్రియుడితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ అసలు నిజం బయటపెట్టిన ప్రేయసి.. అవాక్కవుతున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2023-04-22T17:23:43+05:30 IST

యువతీయువకులు కొన్నిసార్లు తొలి చూపులోనే ప్రేమలో పడిపోతుంటారు. ఆకర్షణతో మొదలయ్యే ప్రేమలు కొన్ని అయితే.. వ్యక్తిత్వం నచ్చడం వల్ల మరికొన్ని ప్రేమలు మొదలవుతుంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌కు సంబంధించిన వార్తలు...

Viral News: ప్రియుడితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ అసలు నిజం బయటపెట్టిన ప్రేయసి.. అవాక్కవుతున్న నెటిజన్లు..!

యువతీయువకులు కొన్నిసార్లు తొలి చూపులోనే ప్రేమలో పడిపోతుంటారు. ఆకర్షణతో మొదలయ్యే ప్రేమలు కొన్ని అయితే.. వ్యక్తిత్వం నచ్చడం వల్ల మరికొన్ని ప్రేమలు మొదలవుతుంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌కు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ యువతి తన ప్రియుడితో దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. సరిగ్గా ఆరేళ్ల క్రితం అంటూ సదరు యువతి అసలు నిజం బయటపెట్టింది. వీరి ప్రేమ గురించి తెలుసుకున్న నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ ప్రేమ జంటకు సంబంధించిన ఫొటో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ యువతి తమ ప్రేమ ఎలా మొదలైందో తెలియజేస్తూ ఫొటోను షేర్ చేసింది. నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్‌లో (Wageningen, Netherlands) ఆరేళ్ల క్రితం సదరు యువతి చదువుకుంటున్న కళాశాలలో స్నేహితులంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు తాను సొంతంగా తయారు చేసిన సమోసాలను (samosa) పార్టీలో స్నేహితులందరికీ పంచి పెట్టాడు. ఆ సమయంలో యువతికి అతడి వ్యక్తిత్వం నచ్చి ప్రేమలో పడిందట.

Viral Video: బయట ధర్మామీటర్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత.. దీన్ని ఓ చెట్టు నీడకు తీసుకెళ్లగానే షాకింగ్ రిజల్ట్.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..!

ప్రేమను వ్యక్తం చేయడానికి ఖరీదైన వస్తువులు అవసరం లేదని, ప్రేమతో ఇచ్చే చిన్న సమోసా సరిపోతుందని ఆమె పేర్కొంది. ‘‘ఆరేళ్ల క్రితం, ఈ వ్యక్తి వాగెనింగెన్‌లోని విద్యార్థి పార్టీలో చేతితో తయారు చేసిన వేడి వేడి సమోసాలతో కనిపించాడు. ఎ కేస్ ఆఫ్ లవ్ ఎట్ ఫస్ట్ బైట్ హిహి’’.. అని పేర్కొంటూ ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా (Viral post) మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మీ ప్రేమ స్వచ్ఛమైనది’’.. అంటూ కొందరు, ‘‘ప్రేమ జంటను కలిపిన సమోసా’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

OYO Rooms: ఓయో రూమ్‌ నుంచి ఓ యువతి ఏడుపులు.. హోటల్‌లో పనిచేసే యువకుడికి డౌట్.. వెళ్లి అడిగితే ఆమె చెప్పింది విని..

Updated Date - 2023-04-22T17:23:43+05:30 IST