Train Accident: ట్రైన్‌ను ఢీకొట్టిన మరో ట్రైన్.. అసలు ఆ టైమ్‌లో కేబిన్‌లో మహిళా డ్రైవర్ ఏం చేస్తోందో కెమెరాలో రికార్డైన వీడియోను చూసి..!

ABN , First Publish Date - 2023-04-21T19:46:47+05:30 IST

ఒక్కోసారి ఒక్కరు చేసే తప్పు.. వందల మందికి ప్రాణసంకటం అవ్వొచ్చు. చాలా మంది, చేసే పనిని పక్కన పెట్టి లేనిపోని పనుల దృష్టి పెట్టి.. చివరకు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ప్రధానంగా ప్రయాణ సమయాల్లో..

Train Accident: ట్రైన్‌ను ఢీకొట్టిన మరో ట్రైన్.. అసలు ఆ  టైమ్‌లో కేబిన్‌లో మహిళా డ్రైవర్ ఏం చేస్తోందో కెమెరాలో రికార్డైన వీడియోను చూసి..!

ఒక్కోసారి ఒక్కరు చేసే తప్పు.. వందల మందికి ప్రాణసంకటం అవ్వొచ్చు. చాలా మంది, చేసే పనిని పక్కన పెట్టి లేనిపోని పనుల దృష్టి పెట్టి.. చివరకు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ప్రధానంగా ప్రయాణ సమయాల్లో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవడం చూస్తూనే ఉన్నాం. కొందరు డ్రైవర్లు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం గతంలో చాలా సార్లు చూశాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ మహిళా డ్రైవర్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైలు నడుపుతూ ఆమె చేసిన పని వల్ల చివరకు రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. చివరకు సీసీ కెమెరా వీడియోలు పరిశీలించగా ఆమె చేసిన నిర్వాకం బయటపడింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ మహిళ రైలు నడుపుతూ (female train driver) ఉంటుంది. పట్టాల మీదే కదా వెళ్తుంది.. ఏమవుతుంది.. అని అనుకుందో ఏమోగానీ కాసేపటికి తర్వాత ముందు వైపు చూడడం మానేసి మొబైల్‌ను (Mobile) చేతిలోకి తీసుకుంది. ఎంచక్కా.. అందులోని వీడియోలు చూస్తూ (Woman looking at phone) కాలక్షేపం చేయసాగింది. మరోవైపు రైలు పట్టాలపై దూసుకెళ్తూ ఉంది. రాత్రి వేళ కావడంతో ప్రయాణికులంతా నిద్రలోకి జారుకున్నారు. ఇలా కొంత దూరం వెళ్లాక ఎదురుగా అదే పట్టాలపై మరో రైలు ఆగి ఉంది. మహిళ ఫోన్‌లో బిజీగా ఉండడంతో ముందు రైలు ఉన్న విషయం గుర్తించలేదు. తీరా దగ్గరికి వచ్చాక గమనించింది.

Viral Video: వామ్మో.. ఈ వ్యక్తి టాలెంట్ మామూలుగా లేదుగా.. వీర లెవల్‌లో ఇంగ్లీషులో దంచేస్తున్నాడు..!

ఎదురుగా రైలు ఉండడం చూసి.. వామ్మో! అనుకుంటూ బ్రేకులు వేసేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే సమీపానికి చేరుకోవడంతో సాధ్యం కాలేదు. రైలు నేరుగా వెళ్లి ఆగి ఉన్న రైలును (train accident) ఢీకొంది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా సీట్లలో నుంచి ఎగిరి పక్కన పడ్డారు. అయితే రైలుకు సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఉండడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిసింది. సీసీ కెమెరా వీడియోలు (CC camera videos) పరిశీలించగా మహిళ నిర్వాకం బయటపడింది. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరిగేది’’.. అంటూ కొందరు, ‘‘వాహనాలు, రైళ్లలో ఫోన్లను నిషేధించాలి’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

OYO Rooms: ఓయో రూమ్‌ నుంచి ఓ యువతి ఏడుపులు.. హోటల్‌లో పనిచేసే యువకుడికి డౌట్.. వెళ్లి అడిగితే ఆమె చెప్పింది విని..

Updated Date - 2023-04-21T19:46:47+05:30 IST