Viral Video: మిస్టరీగా మారిన 4 సెకన్ల వీడియో.. ఆటో పక్కన నిల్చున్న వ్యక్తి అమాంతం గాల్లోకి లేచాడు.. ఆ వెంటనే మరో షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2023-04-20T19:17:54+05:30 IST

కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తమ మానాన తాము పోతున్నా.. ఉన్నట్టుండి ఊహించని ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంటుంది. మరికొన్నిసార్లు...

Viral Video: మిస్టరీగా మారిన 4 సెకన్ల వీడియో.. ఆటో పక్కన నిల్చున్న వ్యక్తి అమాంతం గాల్లోకి లేచాడు.. ఆ వెంటనే మరో షాకింగ్ సీన్..!

కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తమ మానాన తాము పోతున్నా.. ఉన్నట్టుండి ఊహించని ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంటుంది. మరికొన్నిసార్లు అదృష్టం బాగుండి స్వల్ప గాయాలతో బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ అనూహ్య ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆటో పక్కన నిల్చున్న వ్యక్తి అమాంతం గాల్లోకి లేచాడు. వెనువెంటనే మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

బెంగుళూరులోని (Bangalore) తంబుచెట్టి పాళ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక టీసీ పాళ్య జంక్షన్ వద్ద రోడ్డు పక్కన ఓ ఆటో ఆగి ఉంటుంది. దాని పక్కనే ఓ వ్యక్తి నిలబడి ఉంటాడు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ ట్రాక్టర్ ఆటోకు సమీపంలోకి రాగానే ప్రమాదం జరుగుతుంది. రోడ్డుపై పడి ఉన్న ఇనుప తీగ (Iron wire) ట్రాక్టర్‌కు తగులుకుంటుంది. దీన్ని గమనించని ట్రాక్టర్ డ్రైవర్ (Tractor driver) అలాగే ముందుకు వెళ్తాడు. దీంతో తీగ ఆటో పక్కన ఉన్న వ్యక్తికి తగులుతుంది. వేగంగా తగలడంతో అతను ఒక్కసారిగా గాల్లోకి లేస్తాడు. అదే సమయంలో కాస్త ముందు రోడ్డుపై 42 ఏళ్ల సునీత అనే మహిళ (woman) నడుచుకుంటూ వెళ్తుంటుంది. గాల్లోకి లేచిన వ్యక్తి అంతే వేగంగా దూసుకొచ్చి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మీద పడతాడు.

Viral News: విడాకులు రాగానే పండగ చేసుకున్న యువతి.. పెళ్లి దుస్తుల్ని కాల్చేసి.. మాజీ భర్తతో దిగిన ఫొటోలను చింపేస్తూ..

ఈ ప్రమాదంలో ఇద్దరూ దూరంగా విసిరివేయబడతారు. మనిషి గాల్లో ఎగురుకుంటూ రావడాన్ని మహిళ గమనించి అప్రమత్తం అవ్వాలని ప్రయత్నిస్తుంది. అయితే అప్పటికే సదరు వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొనడంతో (man hit the woman) ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే విచిత్రంగా మహిళను ఢీకొన్న వ్యక్తికి మాత్రం ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral videos) అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం! ఎంత ఘోరం జరిగింది’’.. అని కొందరు, ‘‘ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. అనడానికి ఈ ఘటనే ఉదాహరణ’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage: పెళ్లి వేడుకలో సడన్‌గా పవర్ కట్.. చిమ్మచీకట్లో బంధువుల హాహాకారాలు.. కరెంట్ వచ్చాక చూస్తే వధూవరులపై యాసిడ్ దాడి..!

Updated Date - 2023-04-20T19:17:54+05:30 IST