Wife: ఇంటి తలుపుల వద్దే గొయ్యిని తవ్వి.. పోలీసులు చూస్తుండగానే భార్యకు అంత్యక్రియలు.. ఊళ్లో శ్మశానం ఉన్నా ఎందుకిలా చేశారంటే..!

ABN , First Publish Date - 2023-04-19T21:46:12+05:30 IST

కూతురు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అల్లుడికి అడిగినంత కట్నం ఇవ్వడంతో పాటూ కారును కూడా కొనిచ్చారు. వారు అనుకున్నట్లే కొన్ని నెలలు కూతురు సంసారం ఎంతో సంతోషంగా సాగింది. అయితే నెలలు గడిచే కొద్దీ..

Wife: ఇంటి తలుపుల వద్దే గొయ్యిని తవ్వి.. పోలీసులు చూస్తుండగానే భార్యకు అంత్యక్రియలు.. ఊళ్లో శ్మశానం ఉన్నా ఎందుకిలా చేశారంటే..!

కూతురు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అల్లుడికి అడిగినంత కట్నం ఇవ్వడంతో పాటూ కారును కూడా కొనిచ్చారు. వారు అనుకున్నట్లే కొన్ని నెలలు కూతురు సంసారం ఎంతో సంతోషంగా సాగింది. అయితే నెలలు గడిచే కొద్దీ కూతురు సంసారంలో సమస్యలు తలెత్తాయి. చివరకు అనుకోని విధంగా భార్య మృతదేహాన్ని ఏకంగా భర్త ఇంటి తలుపుల వద్ద.. పోలీసులు చూస్తుండగానే గొయ్యి తీసి పాతిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బీహార్‌లోని (Bihar) ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన కాజల్ కుమారి అనే యువతికి (young woman) , మోతీపూర్ గ్రామానికి చెందిన ఆకాష్ అనే యువకుడితో 6నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సందర్భంగా కాజల్ తల్లిదండ్రులు.. వారి ఆర్థిక స్తోమతను బట్టి అల్లుడికి కొంత నగదు, ఓ కారును (Cash and car) కట్నం కింద ఇచ్చారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. నెలలు గడిచే కొద్దీ కాజల్‌కు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. పెళ్లయిన కొన్ని నెలలు బాగానే ఉన్న ఆకాష్.. తర్వాత తనకు మహీంద్రా థార్ ఎస్‌యూవీ (Mahindra Thar SUV) కారు కొనివ్వాలని భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు.

వర్షంలో తడుస్తూ స్కూలు నుంచి ఇంటికెళ్తున్న 11 ఏళ్ల బాలిక.. ఊళ్లో దించుతాననగానే ట్యాక్సీ ఎక్కడమే ఆమె పొరపాటయింది.. మర్నాడే..

అయితే అంత డబ్బు వారి వద్ద లేకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో ఆకాష్ ఆ కోపాన్నంతా భార్యపై చూపించేవాడు. కొత్త కారు కొనివ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఇటీవల కాజల్ గర్భం (pregnancy) దాల్చింది. అయినా ఆకాష్ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. గర్భిణి అని కూడా చూడకుండా నిత్యం వేధింపులకు (Harassment) గురి చేసేవాడు. కొన్నాళ్లు పోతే మారతాడులే అని కాజల్‌తో పాటూ ఆమె తల్లిదండ్రులు కూడా సర్దుకుపోయేవారు. అయితే ఆకాష్ మాత్రం రోజూ రోజుకూ భార్యను మరింతగా చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కారు విషయమై మళ్లీ భార్యతో గొడవ పెట్టుకున్నాడు.

Crime News: మరీ ఇంత నీచమా..? పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని బయటకు తీసి మరీ అత్యాచారం చేశారు..!

మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉన్నట్టుండి తుపాకీ తీసుకుని భార్యపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ దాడిలో కాజల్ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కాజల్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని, కూతురు మృతదేహంపై పడి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కోపంతో రగిలిపోతున్న కాజల్ కుటుంబ సభ్యులు, బంధువులు.. చివరకు ఆమె మృతదేహాన్ని ఆకాష్ ఇంటి వద్దకు తీసుకెళ్లి పోలీసుల ఎదుటే గొయ్యి తవ్వి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Viral News: వీడి తెలివి తెల్లారిపోనూ.. టాయ్‌లెట్ వస్తోందని పోలీసులకు చెప్పి బాత్రూంకు వెళ్లాడు.. కాసేపటికే అరుపులు కేకలు.. వెళ్లి చూస్తే..

Updated Date - 2023-04-19T21:46:12+05:30 IST