Viral Video: అయ్య బాబోయ్.. ఇదేం మాయ.. ఓ చిన్న కుండలోకి దూరిందో పిళ్లి.. మరుక్షణమే ఏం జరిగిందో చూస్తే అవాక్కవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-04-20T17:35:54+05:30 IST

కళ్ల ముందు జరిగే కొన్ని ఘటనలను చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఎక్కడా అనుమానం రాకుండా.. ఏదో మాయ చేసినట్లుగా అనిపిస్తుంటుంది. చాలా మంది ఇంద్రజాలికుల ప్రదర్శనలు కూడా ఇలాంటి ఆశ్చర్యాన్నే కలుగజేస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: అయ్య బాబోయ్.. ఇదేం మాయ.. ఓ చిన్న కుండలోకి దూరిందో పిళ్లి.. మరుక్షణమే ఏం జరిగిందో చూస్తే అవాక్కవడం ఖాయం..!

కళ్ల ముందు జరిగే కొన్ని ఘటనలను చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఎక్కడా అనుమానం రాకుండా.. ఏదో మాయ చేసినట్లుగా అనిపిస్తుంటుంది. చాలా మంది ఇంద్రజాలికుల ప్రదర్శనలు కూడా ఇలాంటి ఆశ్చర్యాన్నే కలుగజేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఎలాంటి మ్యాజిక్ లేకుండా.. ఇదేం మాయ.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ పిల్లి చిన్న కుండలోకి దూరింది. అయితే మరుక్షణమే చోటు చేసుకున్న ఘటన.. అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ వ్యక్తి అందమైన ఓ కుండను పిల్లి ముందు ఉంచి మొబైల్‌లో వీడియో రికార్డు (Video record) అన్ చేస్తాడు. కాసేపటికి పిల్లి ప్రదర్శనకు సిద్ధమవుతుంది. కుండపైకి ఎక్కి చూడండి.. ‘‘ చూడండి.. నా మాయాజాలం’’.. అన్నట్లుగా అందులోకి చాకచక్యంగా దూరిపోతుంది. అయితే మరుక్షణమే లోపలి నుంచి పిల్లి (cat) తల బయటికి వస్తుంది. అయితే లోపలికి దిగినప్పుడు మామూలు రంగులో ఉన్న పిల్లి.. బయటికి రాగానే నల్లగా మారిపోతుంది.

Marriage: పెళ్లి వేడుకలో సడన్‌గా పవర్ కట్.. చిమ్మచీకట్లో బంధువుల హాహాకారాలు.. కరెంట్ వచ్చాక చూస్తే వధూవరులపై యాసిడ్ దాడి..!

మెరుస్తున్న కనుగుడ్లతో భయపెడుతూ బయటకు వస్తుంది. పైకి ఎక్కి కూర్చుని అటూ, ఇటూ చూసి.. ‘‘ చూశారా.. నా పవర్’’.. అన్నట్లుగా కెమెరా వైపు చూస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరె! భలె ఎడిటింగ్ చేశారే’’.. అని కొందరు, ‘‘వావ్! అద్భుతం.. అసలు నమ్మలేకున్నాం’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral News: వీడి తెలివి తెల్లారిపోనూ.. టాయ్‌లెట్ వస్తోందని పోలీసులకు చెప్పి బాత్రూంకు వెళ్లాడు.. కాసేపటికే అరుపులు కేకలు.. వెళ్లి చూస్తే..

Updated Date - 2023-04-20T17:35:54+05:30 IST