Dead Body in Cooler: 5 ఏళ్ల బాలికను చంపి కూలర్‌లో దాచి పెట్టాడు.. కూతురు కోసం ఊరంతా వెతుకుతున్న తల్లిదండ్రులకు నిజం ఎలా తెలిసిందంటే..

ABN , First Publish Date - 2023-04-20T21:35:56+05:30 IST

అల్లారుముద్దుగా పెంచుకున్న ఐదేళ్ల కూతురు.. అనూహ్యంగా అనంతలోకాలకు చేరుకుంటుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు. రోజూ ట్యూషన్‌కి వెళ్లి ఇంటికి వచ్చే కూతురు ఆ రోజు మాత్రం ఎంతకీ రాలేదు. కంగారు పడ్డ తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికినా..

Dead Body in Cooler: 5 ఏళ్ల బాలికను చంపి కూలర్‌లో దాచి పెట్టాడు.. కూతురు కోసం ఊరంతా వెతుకుతున్న తల్లిదండ్రులకు నిజం ఎలా తెలిసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

అల్లారుముద్దుగా పెంచుకున్న ఐదేళ్ల కూతురు.. అనూహ్యంగా అనంతలోకాలకు చేరుకుంటుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు. రోజూ ట్యూషన్‌కి వెళ్లి ఇంటికి వచ్చే కూతురు ఆ రోజు మాత్రం ఎంతకీ రాలేదు. కంగారు పడ్డ తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికినా కనిపించలేదు. చివరకు ఓ ఇంట్లోని కూలర్‌లో విగతజీవిగా బయటపడింది. అంత వరకూ ఆనందంగా ఉన్న కూతురు.. ఒక్కసారిగా అలా మృతదేహంగా మారడం చూసి.. ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భింద్ జిల్లా రాను పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన దంపతులు తమ ఐదేళ్ల కూతురుతో (Five year old daughter) కలిసి నివాసం ఉంటున్నారు. చిన్నారిని అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఆ దంపతులకు.. ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కూతురు బాగా చదువు రావాలనే ఉద్దేశంతో స్కూల్ అనంతరం రోజూ ట్యూషన్‌కి కూడా పంపేవారు. చిన్నారి కూడా ఎంతో శ్రద్ధగా చదువుకుంటూ ఉండేది. ఇలా ఆనందంగా సాగుతున్న ఆ కుటుంబంలో తాజాగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రోజూ ట్యూషన్‌కి వెళ్లి వచ్చే పాప.. బుధవారం మాత్రం తిరిగి ఇంటికి రాలేదు.

Viral News: విడాకులు రాగానే పండగ చేసుకున్న యువతి.. పెళ్లి దుస్తుల్ని కాల్చేసి.. మాజీ భర్తతో దిగిన ఫొటోలను చింపేస్తూ..

కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు.. ట్యూషన్ వద్దకు వెళ్లి విచారించారు. అయితే పాప ఆ రోజు అసలు ట్యూషన్‌కే రాలేదని పిల్లలంతా చెప్పడంతో వారిలో కంగారు మొదలైంది. పరుగు పరుగున వెళ్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా కూతరు జాడ మాత్రం కానరాలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు షాకింగ్ వార్త తెలిసింది. పొరుగున ఉండే సంతోష్ చౌరాసియా అనే వ్యక్తి పాపను ఎత్తుకెళ్లాడని చెప్పడంతో.. పోలీసులు వెంటనే అతడి ఇంటికి వెళ్లారు.

Marriage: పెళ్లి వేడుకలో సడన్‌గా పవర్ కట్.. చిమ్మచీకట్లో బంధువుల హాహాకారాలు.. కరెంట్ వచ్చాక చూస్తే వధూవరులపై యాసిడ్ దాడి..!

లోపల మొత్తం వెతికినా కనిపించలేదు. చివరకు రెండో అంతస్తులో కూడా వెతికారు. ఇలా వెతికే క్రమంలో కూలర్‌లో (Cooler) ఏదో వస్తువు ఉన్నట్లు గుర్తించారు. ఫైనల్‌గా ఓపెన్ చేసి చూడగా.. చేతులు, కాళ్లు కట్టేసి మూటలా చుట్టి ఉన్న పాప మృతదేహం (girl dead body) బయటపడింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అలా విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పోలీసులు పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

OYO Rooms: ఓయో రూమ్‌ నుంచి ఓ యువతి ఏడుపులు.. హోటల్‌లో పనిచేసే యువకుడికి డౌట్.. వెళ్లి అడిగితే ఆమె చెప్పింది విని..

Updated Date - 2023-04-20T21:35:56+05:30 IST