Viral Video: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితిని కళ్లకు కడుతున్న వీడియో.. వార్డులోకి చొరబడిన ఈ కుక్క చివరికి ఏం చేసిందో చూస్తే..

ABN , First Publish Date - 2023-10-11T17:53:22+05:30 IST

కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. కనీస సౌకర్యాలు కూడా లేక చాలా మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడడం చూస్తూనే ఉంటాం. మరికొన్ని ఆస్పత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు..

Viral Video: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితిని కళ్లకు కడుతున్న వీడియో.. వార్డులోకి చొరబడిన ఈ కుక్క చివరికి ఏం చేసిందో చూస్తే..

కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంటాయి. కనీస సౌకర్యాలు కూడా లేక చాలా మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడడం చూస్తూనే ఉంటాం. మరికొన్ని ఆస్పత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోకి ఓ కుక్క చొరబడింది. చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముదరాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రిలో (Government Hospital) ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని ఎమెర్జెన్సీ వార్డులో రోగులు చాలా మంది ఉన్నారు. అయితే అంతా చూస్తుండగా ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలోకి ప్రవేశించిన కుక్క (dog entered the hospital) .. అన్ని గదులు దాటుకుంటూ చివరకు ఏకంగా ఎమర్జెన్సీ వార్డులోకి చొరబడింది. నిద్రపోతున్న రోగి పక్కనే గ్లాసులో పాలు ఉండడంతో ఎంచక్కా వాటిని తాగేసింది. రోగి నిద్రపోతుండడంతో కుక్కను గమనించలేదు. పాలన్నీ తాగిన కుక్క అటూ ఇటూ చూసి తినుబండాలను నోట కరుచుకుని వెళ్లింది.

Viral Video: ఎంత దారుణం! దోపిడీ దొంగలను అడ్డుకున్న పాపానికి ఈ క్యాబ్ డ్రైవర్ పరిస్థితి.. చివరకు..

ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా, ఈ ఘటనపై అధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుక్క వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో దుస్థితి కళ్లకు కట్టినట్లు కనపడుతోంది’’.. అని కొందరు, ‘‘ఇక్కడ తప్పు కుక్కది కాదు.. ఆస్పత్రికి సిబ్బందిది’’.. అని మరికొందరు, ‘‘వీడియో తీస్తున్న వ్యక్తి కుక్కను అదిలించొచ్చుగా’’.., ‘‘మనషి జంతువుల ఆస్పత్రికి వచ్చాడా.. ఏంటీ’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఏనుగుకు చిర్రెత్తుకొస్తే ఇలాగే ఉంటుంది మరి.. అంతపెద్ద చెట్టును గడ్డిపోచలా ఎలా పీకిపడేసిందో చూడండి..

Updated Date - 2023-10-11T17:53:22+05:30 IST