YouTube: యూట్యూబ్ గురించి అస్సలు తెలియని నిజాలివీ.. అసలు మొట్టమొదట అప్‌లోడ్ అయిన వీడియో ఏదో తెలుసా..?

ABN , First Publish Date - 2023-08-11T19:03:45+05:30 IST

వినోదం కావాలంటే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే పెట్టిన ఖర్చును మళ్లీ సంపాదించాలంటే ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. అయితే వినోదంతో పాటూ ఆదాయమూ రెండూ ఒకే చోట దొరికే సదుపాయం ఉంటే ఎలా ఉంటుంది. ఒకప్పుడు ఇది కష్టమేమో గానీ.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో...

YouTube: యూట్యూబ్ గురించి అస్సలు తెలియని నిజాలివీ.. అసలు మొట్టమొదట అప్‌లోడ్ అయిన వీడియో ఏదో తెలుసా..?

వినోదం కావాలంటే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే పెట్టిన ఖర్చును మళ్లీ సంపాదించాలంటే ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. అయితే వినోదంతో పాటూ ఆదాయమూ రెండూ ఒకే చోట దొరికే సదుపాయం ఉంటే ఎలా ఉంటుంది. ఒకప్పుడు ఇది కష్టమేమో గానీ.. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇది చాలా సింపుల్. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న చాలా మంది.. ఇంట్లో కూర్చునే వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లక్షల ఆదాయాన్ని ఆర్జించడం చూస్తూనే ఉన్నాం. అందులోనూ ప్రధానంగా ఎక్కువ మంది యూట్యూబ్‌ ద్వారానే సంపాదిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ అసలు యూట్యూబ్ ఎలా పుట్టింది, ఇందులో మొట్టమొదట అప్‌లోడ్ అయిన వీడియో ఏది, అత్యధిక సబ్‌స్క్రయిబర్స్ ఉన్న ఛానెల్ ఏది..? అనే విషయాలు చాలా మందికి తెలియదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

కాలిఫోర్నియాకు (California) చెందిన చాడ్ హర్లీ, స్టీవ్ చెన్, జావేద్ కరీమ్ అనే ముగ్గురు స్నేహితులు.. 2005కు ముందు వీరంతా అమెరికన్ ఇ-కామర్స్ సంస్థ (American e-commerce company) అయిన పేపాల్‌లో పని చేస్తుండేవారు. వీరికి ఓ రోజు ఓ సందేహం వచ్చింది. అప్పట్లో ఆన్‌లైన్‌లో ఫొటోలు మాత్రమే షేర్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఫొటోలతో పాటూ వీడియోలను (Video sharing) కూడా ఎందుకు షేర్ చేయకూడదు.. అనే ఆలోచన వారికి వచ్చింది. ఈ క్రమంలో జావెద్ కరీమ్ అనే వ్యక్తి శాన్ డియాగో జూలో ఓ వీడియో తీశాడు. 18 సెకన్ల నిడివిగల ఈ వీడియోను 2005 ఏప్రిల్ 24న మొదటిసారిగా ‘‘మీ ఎట్ ది జూ’’ పేరుతో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 240 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇదిలావుండగా, ప్రారంభించిన ఏడాది కాలంలోనే యూట్యూబ్‌ (Youtube) అత్యంత ప్రజాదరణ పొందింది.

Viral News: వామ్మో.. ఆగస్టు 14వ తారీఖే అందరికీ జ్వరం వచ్చేస్తోందట.. ప్రైవేటు ఉద్యోగుల వింత సాకుల వెనుక..!

youtube.jpg

ఈ క్రమంలో 2006లో యూట్యూబ్‌ను గూగుల్ (Google) .. రూ.13,000 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక యూట్యూబ్‌కు అత్యధికంగా భారత దేశంలో 460 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. తర్వాతి స్థానంలో 240 మిలియన్ల యూజర్లతో యూఎస్, 140 మిలియన్ల యూజర్లతో బ్రెజిల్ ఉన్నాయి. దీంతోపాటు అత్యధిక సబ్‌స్క్రయిబర్స్ ఉన్న ఛానెల్ కూడా భారతదేశంలోనే ఉంది. T-Series పేరుతో ఉన్న యూట్యూబ్ చానెల్‌కు 25కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. మరోవైపు ఇప్పటివరకూ యూట్యూబ్ మొత్తంగా సుమారు 700కోట్ల వీడియోలు అప్‌లోడ్ చేయబడ్డాయని తెలిసింది. ఈ వీడియోలన్నీ చూడటానికి 57,000 సంవత్సరాల సమయం పడుతుందట. యూట్యూబ్‌ను నిషేధించిన దేశాలు కూడా ఉన్నాయి. చైనా, ఇరాన్, ఉత్తరకొరియాతో (China, Iran, North Korea) సహా 23దేశాల్లో యూట్యూబ్ కనిపించదు.

Viral News: జాబ్‌లో చేరిన మొదటి రోజే రిజైన్‌ లెటర్ ఇచ్చిన కుర్రాడు.. కారణం అడిగితే చెప్పిన సమాధానం విని బాస్‌కు షాక్..!

Updated Date - 2023-08-11T19:03:45+05:30 IST